వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అటల్ బిహారీ వాజపేయికి కన్నీటి వీడ్కోలు: అంతిమ సంస్కారాలు నిర్వహించిన కూతురు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి అంత్యక్రియలు అభిమానులు, సన్నిహితుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. యమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్మృతిస్థల్‌లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అటల్‌ దత్తపుత్రిక నమిత .. వాజపేయి చితికి నిప్పంటించగా, హిందూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు పూర్తి చేశారు.

అటల్‌ బిహారీ వాజపేయి గురువారం సాయంత్రం 5.05గంటలకు కన్నుమూశారు. బుధవారం సాయంత్రం నుంచే వాజపేయి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు ప్రకటిస్తూ వచ్చారు.

vajpayee-live-updates-nation-to-bid-farewell-at-smriti-sthal-today

Recommended Video

    వాజ్‌పేయి హెల్త్‌ బులెటిన్‌ - ఆరోగ్యం మరింత విషమం!

    కాగా, గురువారం సాయంత్రం 5.05గంటలకు వాజపేయి మృతి చెందారని వైద్యులు ప్రకటించారు.

    Atal Bihari Vajpayee health LIVE:Former PM continues to remain critical says latest medical bulletin

    Newest First Oldest First
    7:14 PM, 17 Aug

    తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి వాజపేయి అని, ఆయనకు దేశ ప్రజల తరపున నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.
    7:13 PM, 17 Aug

    వాజపేయి దేశ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉంటారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
    5:27 PM, 17 Aug

    వాజపేయికి లక్షలాది మంది కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
    5:08 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వాజపేయి చితికి ఆయన కూతురు నమిత నిప్పంటించారు. కాగా, చితికి నిప్పంటించిన సమయంలో నమిత కూతురు, వాజపేయి మనవరాలు నిహారిక కన్నీటిపర్యాంతమైంది.
    5:00 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి హిందూ సాంప్రదాయ ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం ఆయన పార్థీవ దేహాన్ని దహనం చేశారు.
    4:51 PM, 17 Aug

    వాజపేయి అంతిమ సంస్కారాలను ఆయన కూతురు(దత్త పుత్రిక) నమిత నిర్వహించారు.
    4:39 PM, 17 Aug

    విజయ ఘాట్ పక్కన 1.5ఎకరాల్లో వాజపేయి మెమోరియల్‌ను ఏర్పాటు చేయనున్నారు.
    4:36 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహంపై కప్పివుంచిన త్రివర్ణ పతాకాన్ని ఆయన మనవరాలు నిహారికకు అందజేస్తున్న దృశ్యం.
    4:34 PM, 17 Aug

    బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.. వాజపేయికి నివాళులర్పించారు.
    4:34 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి ఆఫ్ఘనిస్తాన్ మాజీ హమీద్ కర్జాయ్, శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి లక్ష్మణ్ నివాళులర్పించారు.
    4:25 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి ముఖ్య నేతల నివాళులు.
    4:23 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నివాళులర్పించారు.
    4:22 PM, 17 Aug

    వాజపేయి అంతిమసంస్కారాల్లో పాల్గొన్న నేతలు.
    4:22 PM, 17 Aug

    వాజపేయికి నివాళులర్పించిన కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్.
    4:16 PM, 17 Aug

    వాజపేయి అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు పాల్గొని నివాళులర్పించారు.
    4:06 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి త్రివిధ దళాల అధిపతుల నివాళులు.
    4:01 PM, 17 Aug

    స్మృతీ స్థల్ వద్ద ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా.
    4:00 PM, 17 Aug

    స్మృతీ స్థల్ వద్దకు వాజపేయి పార్థీవ దేహాన్ని తీసుకొస్తున్న దృశ్యం.
    3:59 PM, 17 Aug

    స్మృతీ స్థల్ చేరుకున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
    3:33 PM, 17 Aug

    స్మృతీ స్థల్‌కు చేరుకుంటున్న వాజపేయి అంతిమయాత్ర.
    3:32 PM, 17 Aug

    వాజపేయి మృతికి సంతాప సూచకంగా న్యూఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ కార్యాలయంపై బ్రిటన్ జెండాను సగం వరకు అవతనం చేసిన దృశ్యం.
    3:09 PM, 17 Aug

    లక్షలాది అభిమానుల మధ్య అటల్ బిహారీ వాజపేయి కొనసాగుతున్న అంతిమ యాత్ర.
    3:09 PM, 17 Aug

    వాజపేయి అంతిమయాత్రలో ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర బీజేపీ నేతలు, లక్షలాది అభిమానులు.
    2:42 PM, 17 Aug

    వాజపేయి అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
    2:41 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహాన్ని స్మృతీ స్థల్‌కు తరలిస్తుండగా.. లక్షలాదిగా అభిమానులు తరలివచ్చారు.
    2:39 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహం వెంట నడుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.
    2:39 PM, 17 Aug

    బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అంతిమ సంస్కారాలు నిర్వహించే స్మృతీ స్థల్‌కు వాజపేయి పార్థీవ దేహాన్ని తరలిస్తున్న దృశ్యం.
    2:38 PM, 17 Aug

    వాజపేయి పార్థీవ దేహానికి ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ నివాళులర్పించారు.
    2:36 PM, 17 Aug

    భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగేల్ వాంగ్‌చుక్.. వాజపేయి పార్థీవ దేహానికి నివాళులర్పించారు.
    1:26 PM, 17 Aug

    వాజపేయికి నివాళులర్పించేందుకు ఢిల్లీకి వచ్చిన శ్రీలంక విదేశాంగ మంత్రి లక్ష్మణ్.
    READ MORE

    English summary
    Former PM Atal Bihari Vajpayee's health has worsened over last 24 hours and is critical, an official statement by AIIMS said on Wednesday.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X