వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేల్ కృషిని జాతి మరువదు: మోడీ నివాళి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశాన్ని ఏకం చేసేందుకు పటేల్ చేసిన కృషిని భారత జాతి ఎప్పటికీ మరిచిపోదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 140వ జయంతి వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. పటేల్ స్మారక స్తూపం వద్ద ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, తదితరులు నివాళులర్పించారు.

రాజ్‌పథ్‌లో ఐక్యత పరుగును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మోడీ మాట్లాడుతూ... ‘పటేల్ రాజనీతి కౌశలం ఎంతో గొప్పది. పటేల్ జీవన విధానం, సిద్ధాంతాలు సదా ఆచరనీయం. మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం మనం మాట్లాడుతున్నాం. అహ్మదాబాద్‌లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లపై పటేల్ అప్పట్లోనే ప్రతిపాదించారు' అని చెప్పారు.

Vallabhbhai Patel's ideology and heritage cannot be forgotten: Narendra Modi

‘పటేల్ స్పూర్తితో ఐక్య శ్రేష్ఠ భారత్ సాధన దిశగా కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. దేశం బలంగా, సాధికారికంగా నిలబడిందంటే సర్ధార్ సంకల్పమే కారణం. పటేల్ అహ్మదాబాద్‌లో 222 రోజుల పాటు స్వచ్ఛ అభియాన్ నిర్వహించారు. అప్పటి నుంచే స్వచ్ఛత కార్యక్రమానికి ముందడుగు పడిందని గుర్తు చేశారు' అని ప్రధాని మోడీ తెలిపారు.

‘స్వచ్ఛతపై పటేల్‌కు ఉన్న సంకల్పాన్ని చూసి గాంధీ అభినందించారు. సర్దార్ పటేల్ దేశ విభజన శక్తులను ధీటుగా ఎదుర్కొన్నారు. ఐక్యభారత్, శ్రేష్ఠభారత్ సాధన దిశగా కలిసికట్టుగా నడవాలని పిలుపునిచ్చారు. దేశమంతా ఐక్యంగా ఉండడమే భారత్‌కు అతిపెద్ద శక్తి' అని మోడీ అన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday paid his tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary and said that ‘Sardar Vallabhbhai Patel's ideology and heritage cannot be forgotten.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X