వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

100కేజీల బీఫ్ తరలిస్తున్న వ్యాన్‌కు నిప్పుపెట్టారు

|
Google Oneindia TeluguNews

ముంబై: బీఫ్(ఆవు మాసం) నిషేధంపై ఆయా రాష్ర్టాల్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో సుమారు 100 కేజీల బీఫ్‌ను తరలిస్తున్న వాహనానికి సుమారు 100 మంది నిప్పు పెట్టారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

మహారాష్ట్రలో బీఫ్‌పై నిషేధం విధించిన నేపథ్యంలో అక్రమంగా అమ్మేందుకు కొందరు యత్నించారు. అహ్మద్‌నగర్ నుంచి ఔరంగాబాద్‌కు బీఫ్‌ను తరలిస్తుండగా సావ్‌ఖేడా గ్రామం వద్ద వ్యాన్‌ను ఆపి డ్రైవర్‌తో గొడవకు దిగి నిప్పు పెట్టారు.

Van Set on Fire in Maharashtra After Beef Suspicion

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వ్యాన్‌లో తరలిస్తున్నది బీఫ్ అని నిర్ధారించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. బీఫ్‌ను తరలిస్తున్న డ్రైవర్‌పై, నిప్పు పెట్టిన ఆందోళనకారులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల బీఫ్ నిషేధం పలు సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రీలో ఇఖ్లాక్ అనే వ్యక్తిని కొట్టి చంపారు. కాగా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో బీఫ్‌పై నిషేధం ఎత్తివేయాలని ఎన్సీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు.

English summary
A van was set on fire in Maharashtra by a mob of over 100 people on Sunday night after they suspected that it was carrying beef. Later, the police confirmed that preliminary investigations indicated that it was indeed carrying around 100 kg of beef.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X