*వణక్కం రాహుల్ గాంధీ* హ్యాష్ ట్యాగ్... యువతలో ఏ మాత్రం తగ్గని రాహుల్ క్రేజ్
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచార నగారాను మోగించిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా సాగింది. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొన్న రాహుల్ గాంధీ వారితో చాలా సరదాగా మాట్లాడారు. సార్ అని పిలవద్దు రాహుల్ అనండి చాలు అంటూ విద్యార్థులతో ఫ్రెండ్లీగా సంభాషించారు.
రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?
రాహుల్ రాకకు చాలా ముందుగానే అక్కడికి వచ్చి కూర్చున్న యువతులు... రాహుల్ రాక కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూడటం కనిపించింది. రాహుల్ పట్ల ఏ మేర ఆసక్తి ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో *వణక్కమ్ రాహుల్ గాంధీ* అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను పెట్టింది. ఈ హ్యాష్ ట్యాగ్ తమిళనాడు యువతులను బాగానే ఆకట్టుకుంది.
రాహుల్ ను చూసేందుకు నేరుగా సమావేశానికి వచ్చేసిన యువతులు చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఆయన రాకకోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ యువతి మరింత ఎగ్జైట్ మెంట్ కు గురై... రాహుల్ కోసం వేచి చూడటం కూడా తనతో కావడం లేదంటూ ఆసక్తికర వీడియో చేసింది. ఈ చిన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే... తన కోసం అమ్మాయిలంతా వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటే... రాహుల్ కూడా వారి ఎగ్జైట్ మెంట్ ను ఏమాత్రం నిరాశపరచకుండా లాల్చీ పైజామాను వదిలేసి ఏకంగా కాలేజీ కుర్రాడిలా జీన్స్, టీ షర్ట్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కోసం ఎదరు చూస్తున్న యువతులను ఆయన అదే ఎగ్జైట్ మెంట్ లో ఉండేలా చేశారు. ఇక వారితో సెల్ఫీ లు దిగుతూ హల్ చల్ చేశారు. దీంతో రాహుల్ గాంధీకి యువతుల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని అర్థమవుతోంది.