వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వందేమాతర నినాదం ఇస్లాంకు వ్యతిరేకం...అది మా నినాదం కాదు.. ఎస్పి ఎంపీ ...వీడీయో

|
Google Oneindia TeluguNews

గత రెండు రోజులుగా పార్లమెంట్‌లో అభ్యర్థులు తమ ప్రమాణా స్వీకారాలు కొనసాగిస్తున్నారు. అయితే ఆయా పార్టీల నుండి గెలిచిన ఎంపీలు పలు నినాదాలు చేస్తున్నారు. ఈనేపథ్యంనే బిజేపీ ఎంపీలు జై శ్రీరాంతోపాటు, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇతర పార్టీల ఎంపీలు సైతం తమ వ్యక్తిగత స్లోగన్స్ వినిపించారు.

 వందేమాతరం నినాదాన్ని మేము వ్యతిరేకిస్తాము ఎస్పి ఎంపీ

వందేమాతరం నినాదాన్ని మేము వ్యతిరేకిస్తాము ఎస్పి ఎంపీ

ఈనేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ నుండి ఎన్నికైన సమాజ్‌వాది ఎంపీ షఫికర్ రహ్మాన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో కూడ వెనకనుండి జై శ్రీరాం, వందేమాతరం అంటూ నినాదాలు వచ్చాయి. షఫికర్ రహ్మాన్ ఉర్ధూలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వందేమాతరం నినాదాలపై ఆయన పార్లమెంట్‌లోనే స్పందించారు. వందేమాతరం నినాదం ఇస్లాం మతామనికి వ్యతిరేకమని ఆ నినాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించమని అన్నారు.

వందేమాతర నినాదంపై వాక్ అవుట్ చేసిన ఎంపీ

కాగా గతంలో కూడ షఫికర్ వందేమాతర నినాదంపై కూడ పార్లమెంట్‌లో వాక్ అవుట్ చేశాడు. దీంతో చాల సార్లు ఆయన విమర్శలు ఎదుర్కోనున్నాడు. కాగా షఫికర్ ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిపై సుమారు రెండు లక్షల ఓట్లతో గెలుపోందాడు.కాగా అంతకు ముందు వందే మాతరం , జై భారత్ నినాదాలను అంగీకరించిన ఎంఐఎమ్ సభ్యుడు కూడ పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం అనంతరం జై భీం, జై మీం, అల్లాహు అక్భర్ , జై హిందూ అంటూ నినాదాలు చేశారు.

భూతల్లికంటే ఎవరు గోప్ప ,అఖిలేష్ యాదవ్

భూతల్లికంటే ఎవరు గోప్ప ,అఖిలేష్ యాదవ్

అయితే సమాజ్‌వాది అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మాత్రం వందేమాతర నినాదంపై సానూకూలంగా స్పందించారు. వందే మాతర నినాదాన్ని తాను ఒక భూ తల్లిగా భావిస్తానని చెప్పారు. భూమి మించిన తల్లి మరేవరు ఉండరని పేర్కోన్నారు.భూమి కంటే గొప్ప తల్లి ఎవరైన ఉంటే చెప్పాలని కూడ అన్నారు. కాగా ఈ నినాదాన్ని బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర్ర ఉద్యమంలో ఉపయోగించిన విషయం తెలిసిందే..

English summary
Samajwadi Party MP Shafiqur Rahman Barq on Tuesday stirred the hornet's nest by refusing to say "Vande Mataram" in Parliament as "it was against Islam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X