వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌లో వందేమాతరం, భారత్ మాతాకి జై అనకూడదని ఎవరు చెప్పారు..? స్పికర్ ఓం బిర్లా

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ హౌస్‌లో వందేమాతరం ,భారత్ మాతాకి జై అనే నినాదాలు నిషేధం కాదని స్వయంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. దీంతోపాటు వాటిని అనకూడదని ఎవరు చెప్పారంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఈ నినాదాలు పలు విమర్శలు ఎదుర్కుంటున్న నేపథ్యంలోనే స్వయంగా లోక్‌సభ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Vande Mataram and Bharat Mata Ki Jai parmitted in loksabha ; Om Birla

పార్లమెంట్‌లో ఇటివల గెలిచిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎంపీలు తమ ప్రమాణ స్వీకారం సంధర్భంలో పలు రకాల నినాదాలు చేశారు. అందులో ముఖ్యంగా జై శ్రీరాం, భారత మాతాకి జై, వందే మాతరం వంటి నినాదాలు ఇచ్చారు. మరోవైపు ఎవరికి నచ్చిన నినాదాలు వారు చేసుకున్నారు. తెలంగాణ ఎంపీలు జై తెలంగాణ అంటే , మరికొంతమంది జై భీం అంటూ నినాదాలు చేశారు.

ఇక ఉత్తర ప్రదేశ్‌కు చెంది ఎస్పి ఎంపీ ఏకంగా వందేమాతరం నినాదం ఇస్లాంకు వ్యతిరేక మంటూ పార్లమెంట్‌లోనే ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ జై భీం, జై మీం , అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు చేశారు.ఇలాంటీ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో ఇలాంటీ నినాదాలపై ప్రశ్నించిన మీడియాకు నూతనంగా ఎన్నికైన లోక్‌సభ స్సీకర్ ఓం బిర్ల స్పందించారు. వాటిలో వందేమాతరంతో పాటు భారత్ మాతాకి జై నినాదాలు చేయడం తప్పు కాదని ఆయన స్పష్టం చేశారు.

English summary
After controversy over "Vande Mataram" and "Bharat Mata Ki Jai" slogans that were raised as parliamentarians took oath this week, newly-elected Lok Sabha Speaker Om Birla today said, "Who said you cannot say this?"
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X