వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతిష్టాత్మక వందేభారత్ రైలుకు ఆకతాయిల బెడద : అరికట్టేందుకు సరికొత్త వ్యుహం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : వందేభారత్ రైళ్లో ఆకతాయిల చేష్టల మితిమీరిపోయాయి. తొలి సెమీ హైస్పీడ్ ఎక్స్ ప్రెస్ పై తరచూ దాడులు జరుగుతున్నాయి. దుండగులు రాళ్లతో దాడిచేయడంతో రైల్వే పోలీసు విభాగం వారిని గుర్తించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాళ్లు రువ్వుతున్న అల్లరి మూకల్ని గుర్తించేందుకు వీలుగా రైలులో నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

vandemataram express rail attack by locals : railway officials establish cc cameras

రైలులో దాడులు .. పగిలిన అద్దాలు
గత నెల 17న కూడా కొందరు రైలుపై రాళ్లు విసరడంతో ఓ అద్దం పగిలిపోయింది. ఈసారి ఘటన ఎక్కడ జరిగిందో ఆధునాతన టెక్నాలజీతో గుర్తించారు. రాళ్లు రువ్విన అల్లరిమూకలను సీసీ కెమెరాల సాయంతో గుర్తించామని రైల్వే పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అల్లరిమూకలు చేసిన దాడులతో ఇప్పటివరకు 12 అద్దాలను మార్చాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

స్థానికులకు అవగాహన
ఢిల్లీ- వారణాసి మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ గత నెలలో ప్రారంభించగా .. ట్రయల్ రన్ లో ఉండగానే స్థానికులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. కమర్షియల్ రన్ ప్రారంభమైన తర్వాత కూడా రైలుపై దాడికి దిగారు. వీరి చర్యలను అడ్డుకోవాలని రైల్వే పోలీసులు చర్యలకు ఉపక్రమించరారు. దానిలో భాగంగా స్థానికులకు అవగాహన కల్పించడం, స్థానికంగా ఉన్న చిన్నారులకు చాక్లెట్లు పంచిపెట్టే కార్యక్రమాలు కూడా చేపట్టారు. తాజాగా రైలులో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.

English summary
Vandabharat railway is overwhelmed by the brutality. Most of the attacks on the first semi-high speed eXpress are going on. As the gang raided the stones, the Railway Police department took steps to find them. Four cc cameras have been installed on the train so that the stones can be spotted by a loud sound.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X