వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Varanasi: కాశీ విశ్వనాథుడిని దర్శనానికి నిబంధనలు: అవి లేకుంటే అడుగు కూడా పెట్టనివ్వరు.. !

|
Google Oneindia TeluguNews

లక్నో: పవిత్ర పుణ్యక్షేత్రం వారణాశిలో వెలసిన కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకుని రానున్నారు. త్వరలోనే ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలపై భక్తులకు అవగాహన కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చిస్తున్నారు. అవి ఓ కొలిక్కి వచ్చిన తరువాత.. ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

డ్రెస్ కోడ్ తప్పనిసరి..
కాశీ విశ్వనాథుడిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచీ వచ్చే భక్తులకు డ్రెస్ కోడ్‌ను తప్పనిసరి చేయడమే ఆ నూతన నిబంధన. మహిళలు చీరె, పురుషులు ధోతీ, కుర్తాను ధరించడం తప్పనసరి చేయనున్నారు. త్వరలో దీన్ని అమలులోకి తీసుకుని రానున్నారు. కాశీ దేవస్థానానికి సంబంధించినంత వరకూ అత్యున్నత మండలిగా భావించే కాశీ విద్వత్ పరిషత్ సోమవారం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎప్పటి నుంచి అమలు చేయాలనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని కూడా తీసుకోలేదు.

 Varanasi: Mandatory to wear ‘dhoti-kurta, saree for entering sanctum of Kashi Vishwanath temple

డ్రెస్ కోడ్‌పై విస్తృత ప్రచారం..
కాశీ విశ్వనాథుడి ఆలయంలో ప్రవేశ పెట్టదలిచిన ఈ డ్రెస్ కోడ్‌పై విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టాలని విద్వత్ పరిషత్ నిర్ణయించింది. దేశం నలుమూలల నుంచి వారణాశికి వచ్చే అన్ని రైళ్లపైనా దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్లను అతికించడంతో పాటు.. రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లల్లో బ్యానర్లను ఏర్పాటు చేయనున్నారు. దేశ రాజధాని సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

English summary
New dress code introduced for the devotees visiting the Kashi Vishwanath Temple in Varanasi, Uttar Pradesh. The devotees visiting the holy shrine will now reportedly have to follow a dress code to enter the sanctum of the temple.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X