వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నామినేషన్‌ వేళ.. వారణాసి మెరిసేలా..! లక్షన్నర లీటర్ల మంచినీరు వృధా..!

|
Google Oneindia TeluguNews

వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్త వైరల్ గా మారింది. మోడీ వస్తున్న సందర్భంలో రోడ్లను శుభ్రపరచడానికి లక్షా 40 వేల లీటర్ల మంచినీటిని వృధా చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ప్రధాన కూడళ్లతో పాటు వారణాసి తళతళ మెరిసేలా ట్యాంకర్ల కొద్దీ నీరు వేస్ట్ చేశారనే టాక్ జోరందుకుంది.

శుక్రవారం వారణాసి నుంచి మోడీ నామినేషన్ వేయనుండటంతో.. గురువారం రాత్రి రోడ్లను శుభ్రం చేయించారట మున్సిపల్ అధికారులు. మోడీ నామినేషన్ కు ముందు వారణాసి వీధుల్లో భారీ ర్యాలీ తలపెట్టడంతో.. రోడ్లను క్లీన్ చేయించాలంటూ పైనుంచి ఆదేశాలు అందాయని చెబుతున్నారట.

తండ్రి దారిలో ఆశారాం బాపు కుమారుడు.. అత్యాచారం కేసులో దోషితండ్రి దారిలో ఆశారాం బాపు కుమారుడు.. అత్యాచారం కేసులో దోషి

Varanasi uses 1.4 lakh litres of water to wash roads for Narendra Modi

వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన దాదాపు 40 ట్యాంకర్లు, 400 మంది కార్మికులతో రోడ్లు, ప్రధాన కూడళ్లు శుభ్రం చేయించినట్లు తెలుస్తోంది. వారణాసి పర్యాటక కేంద్రం కావడంతో పండుగల సమయంలో మాత్రమే నీటితో రోడ్లను శుభ్రం చేసే ఆనవాయితీ ఉందట. కానీ మోడీ నామినేషన్ సందర్భంగా దాదాపు లక్షన్నర లీటర్ల నీరు వృధా చేయడమేంటనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

English summary
Around 1.4 lakh litres of drinking water was used on Wednesday night to wash the roads of Varanasi where over 30 per cent of the population goes without piped water. A day later, Prime Minister and aspiring candidate Narendra Modi hit the city to a rousing welcome and led a spectacular road show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X