వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవరరావుకు ఊరట ... అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు బెయిల్ మంజూరు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ రచయిత, విరసం నేత వరవర రావు కి బాంబే హైకోర్టు ఇచ్చిన బెయిల్ తో ఎట్టకేలకు ఊరట లభించింది. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆర్నెల్ల పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు గా జస్టిస్ ఎస్ ఎస్ షిండే , మనీష్ పిటాలేల నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ఆ సాక్ష్యాలను ముందు చూపండి ... దిశా రవి కేసులో పోలీసులకు ధర్మాసనం కీలక ప్రశ్నలు ఆ సాక్ష్యాలను ముందు చూపండి ... దిశా రవి కేసులో పోలీసులకు ధర్మాసనం కీలక ప్రశ్నలు

ముంబైలో అవసరం అయినప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని సూచించిన కోర్టు

ముంబైలో అవసరం అయినప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని సూచించిన కోర్టు


కొరెగావ్-భీమా కేసులో రెండేళ్లుగా జైలులో ఉన్న 81 ఏళ్ల కవి కార్యకర్త, విరసం నేత వరవరరావుకు అనారోగ్య కారణాల వల్ల బొంబాయి హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ హైకోర్టు జోక్యం తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు చికిత్స అందించటానికి అడ్మిట్ చేసింది ,. బెయిల్ మంజూరు చేసిన కోర్టు వరవరరావును ముంబైలో ఉండాలని మరియు అవసరమైనప్పుడు దర్యాప్తుకు అందుబాటులో ఉండాలని కోర్టు కోరింది.

వరవరరావు బెయిల్ కోసం భార్య హేమలత ప్రయత్నం

వరవరరావు బెయిల్ కోసం భార్య హేమలత ప్రయత్నం

గత కొద్ది రోజులుగా వరవరరావు అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ ఆయన సతీమణి హేమలత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన బెయిల్ కోసం పలు పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి 1న తీర్పును రిజర్వులో ఉంచింది ఇక తీర్పును ఈ రోజు వెల్లడించింది. సుదీర్ఘ కాలంగా బెయిల్ కోసం పోరాటం చేస్తున్న వరవరరావుకు ఫైనల్ గా బెయిల్ లభించింది .

Recommended Video

Revolutionary poet Varavara Rao confirmed the safty | Oneindia Telugu
 గత ఫిబ్రవరి నుండి సంవత్సర కాలంలో 149 రోజులు ఆసుపత్రిలోనే వరవరరావు

గత ఫిబ్రవరి నుండి సంవత్సర కాలంలో 149 రోజులు ఆసుపత్రిలోనే వరవరరావు

అనారోగ్య కారణాలతో గత కొంత కాలంగా వరవరరావుకు బెయిల్ కోసం అతని న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రయత్నిస్తున్నారు. తన ఆరోగ్య పరిస్థితిని బొంబాయి హైకోర్టు ముందు ఎత్తిచూపారు . గత ఫిబ్రవరి నుండి సంవత్సర కాలంలో ఆయన 149 రోజులు ఆసుపత్రిలో గడిపాడు. వరవరరావును మహారాష్ట్రలోని తలోజా జైలు నుండి బయటకు పంపించాలని, అతన్ని ఇంటికి వెళ్లి హైదరాబాద్‌లో తన కుటుంబంతో కలిసి ఉండటానికి అనుమతించాలని కోర్టును కోరారు.

కోరేగావ్ భీమా హింసకు కారకులంటూ వరవరరావు అరెస్ట్ .. ఆరోపణ ఖండించిన విరసం నేత

కోరేగావ్ భీమా హింసకు కారకులంటూ వరవరరావు అరెస్ట్ .. ఆరోపణ ఖండించిన విరసం నేత

ఈ కేసులో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) దర్యాప్తులో, డిసెంబర్ 31, 2017 న పూణేలో జరిగిన ఎల్గర్ పరిషత్ కన్క్లేవ్ లో రెచ్చగొట్టే ప్రసంగాల ఆరోపణలు ఉన్నాయి, మరుసటి రోజు కొరెగావ్-భీమా సమీపంలో హింసకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. మావోయిస్టులతో కలిసి హింసకు కుట్ర పన్నారని వరవరావు, మరో తొమ్మిది మంది కార్యకర్తలపై ఆరోపించారు. విప్లవాత్మక రచయితల సంఘం "విరసం" కు నాయకత్వం వహించిన వరవరరావు ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించారు.

English summary
Varavara Rao, the 81-year-old poet-activist who has been in jail for over two years in the Koregaon-Bhima case, was granted bail for six months by the Bombay High Court today on medical grounds. He is currently undergoing treatment at Mumbai's Nanavati Hospital where was admitted by the Maharashtra government following the high court's intervention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X