• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆసుపత్రికి వరవర రావు: కుటుంబ సభ్యులకు అనుమతి: వైద్య ఖర్చును భరిస్తామని ఉద్ధవ్ సర్కార్ హామీ

|

ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టయిన తెలుగు విప్లవ రచయిత, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావుకు బోంబే హైకోర్టు ఊరట కల్పించింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది. 15 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో వైద్య చికిత్స తీసుకోవచ్చని పేర్కొంది. ఆసుపత్రిలో ఉన్న కాలంలో వరవర రావును చూడటానికి ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చింది. వరవర రావు వైద్య ఖర్చులకు అయ్యే ఖర్చును భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం బోంబే హైకోర్టుకు వెల్లడించింది.

భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఏ: వరవర రావు ఇద్దరు అల్లుళ్ల సమన్లు: ఇఫ్లూ ప్రొఫెసర్..భీమా కోరేగావ్ కేసులో ఎన్ఐఏ: వరవర రావు ఇద్దరు అల్లుళ్ల సమన్లు: ఇఫ్లూ ప్రొఫెసర్..

 రెండేళ్లుగా జైలులో..

రెండేళ్లుగా జైలులో..

మావోయిస్టులతో సంబంధాలు ఉండటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే కారణంతో రెండేళ్ల కిందట వరవర రావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ బారినా పడ్డారు. దీనితో మూడు వారాల వరకు వరవర రావు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్లీ జైలుకు తరలించారు.

నడవలేని స్థితికి..

నడవలేని స్థితికి..

జైలుకు తరలించినప్పటి నుంచీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం మెరుగు పడలేదు. మూత్రనాళ సంబంధ సమస్యలను ఆయన ఎదుర్కొంటున్నారు. నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. తలోజా జైలు అధికారులు వరవర రావుకు అరకొరగా వైద్య సహాయాన్ని అందిస్తున్నారని, ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ మానవ హక్కుల కార్యకర్తలు బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ బుధవారం బోంబే హైకోర్టు సమక్షానికి విచారణకు వచ్చింది. వరవర రావు తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలను వినిపించారు.

మూడునెలలుగా ఒకే క్యాథెటర్..

మూడునెలలుగా ఒకే క్యాథెటర్..

వరవర రావుకు జైలు అధికారులు అందిస్తోన్న వైద్యం చాలట్లేదని, మెరుగైన చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నడవలేని స్థితికి ఆయన చేరుకున్నారని, మంచానికి పరిమితం అయ్యారని చెప్పారు. మూత్రం సజావుగా రావడానికి వీలుగా అమర్చిన క్యాథెటర్‌ను మూడు నెలలుగా మార్చలేదని, ఫలితంగా- ఇతర అనారోగ్య సమస్యలకు అది దారి తీస్తుందని ఇందిరా జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టులో ఆయన గుండెపోటుకు గురి కాగా నానావతి ఆసుపత్రికి తరలించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నానావతి ఆసుపత్రిలో అడ్మిట్..

నానావతి ఆసుపత్రిలో అడ్మిట్..


అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదని న్యాయస్థానానికి సూచించారు. మానవతా దృక్పథంతోనైనా వరవర రావుకు మెరుగైన చికిత్సను అందించాల్సిన అవసరం ఉందని వాదించారు. ఈ వాదనలతో బోంబే హైకోర్టు న్యాయమూర్తులు ఏకీభవించారు. ఆయనను ఆసుపత్రికి తరలించడానికి అనుమతి ఇచ్చారు. నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి అంగీకరించారు. 15 రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే- చికిత్స తీసుకుంటోన్న కాలంలో కుటుంబ సభ్యులు ఆయనను చూడొచ్చని, పరామర్శించవచ్చని అన్నారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చను భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

English summary
The Bombay High Court on Wednesday allowed Bhima Koregaon violence accused Varavara Rao to be admitted at Nanavati hospital for 15 days of treatment, on state government’s cost. His family will be allowed to visit him as per the hospital’s norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X