వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా హాట్‌స్పాట్స్: అపార్ట్‌మెంట్లకు అపార్ట్‌మెంట్లే సీజ్: రాత్రికి రాత్రి మెరుపు నిర్ణయం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లాగే కరోనా వైరస్ బారిన పడిన దేశ రాజధానిలో కలకలం చెలరేగింది. ఢిల్లీలో కరోనా వైరస్ విస్తరింపజేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కేజ్రీవాల్ సర్కార్.. హాట్‌స్పాట్ జాబితాలో చేర్చింది. వందలాది కుటుంబాలు నివసించే అపార్ట్‌మెంట్లు సైతం ఈ జాబితాలో ఉన్నాయి. వాటన్నింటికీ రాత్రికి రాత్రి తాళం వేసింది ప్రభుత్వం. కంటైన్‌మెంట్లు జోన్లుగా ప్రకటించింది. ఒక్క మనిషి కూడా బయటికి రానివ్వకుండా గేట్లను మూసివేయించింది. పోలీసులతో పహారాను ఏర్పాటు చేసింది.

పాకిస్తాన్‌లోనూ తబ్లిగి జమాత్ కల్లోలం:ఢిల్లీ తరహాలో..: 80 వేల మందితో సామూహిక మత ప్రార్థనలుపాకిస్తాన్‌లోనూ తబ్లిగి జమాత్ కల్లోలం:ఢిల్లీ తరహాలో..: 80 వేల మందితో సామూహిక మత ప్రార్థనలు

వర్ధమాన్, మయూర ధ్వజ అపార్ట్‌మెంట్లు సీజ్..

వర్ధమాన్, మయూర ధ్వజ అపార్ట్‌మెంట్లు సీజ్..

మయూర్ విహార్ ఫేస్-1 ఎక్స్‌టెన్షన్ పరిధిలోని వర్ధమాన్ అపార్ట్‌మెంట్, పాండవ్ నగర్‌లోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లో గల మయూర ధ్వజ అపార్ట్‌మెంట్లను కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. బయటికి వెళ్లడానికి వినియోగించే అన్ని మార్గాలనూ మూసివేశారు. పోలీసులను మోహరింపజేశారు. ఈ రెండు అపార్ట్‌మెంట్లను కంటైన్‌మెంట్ జోన్లుగా మార్చినట్లు నోటీసులను అతికించారు.

అన్నింటినీ సమకూరుస్తూనే..

అన్నింటినీ సమకూరుస్తూనే..

ఈ రెండు అపార్ట్‌మెంట్లల్లో వందలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. కొందరు అధికారుల కుటుంబాలు సైతం ఈ అపార్ట్‌మెంట్లల్లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. కంటైన్‌మెంట్ జోన్లుగా గుర్తించిన నేపథ్యంలో.. అపార్ట్‌మెంట్ వాసులు రోడ్ల మీదికి రాకుండా నిషేధాన్ని విధించారు. పాలతో సహా వారికి అవసరమైన నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే సమకూర్చుతున్నారు. ఈ నిర్బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమని, కరోనా వైరస్ ఉధృతి తగ్గేంత వరకూ ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేమని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు.

నిజాముద్దీన్ మర్కజ్ సహా 19 ప్రాంతాలు హాట్‌స్సాట్లుగా..

నిజాముద్దీన్ మర్కజ్ సహా 19 ప్రాంతాలు హాట్‌స్సాట్లుగా..

తబ్లిగి జమాత్ మత ప్రార్థనలకు వేదికగా మారిన నిజాముద్దీన్ మర్కజ్ సహా మొత్తం 19 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది ఢిల్లీ ప్రభుత్వం. మాలవీయ నగర్, సింగం విహార్, ద్వారకాలోని షాజహానాబాద్ సొసైటీ, దిన్పూర్ విలేజ్, మర్కజ్ మసీదు, నిజాముద్దీన్ బస్తీ, నిజాముద్దీన్ వెస్ట్, జహంగీర్‌పురి, కళ్యాణ్‌పురి, వసుంధర ఎన్‌క్లేవ్, ఖిచీర్‌పూర్, పాండవ్ నగర్, మయూర్ విహార్ ఫేస్-1, కృష్ణ కుంజ్ ఎక్స్‌టెన్షన్, వెస్ట్ వినోద్ నగర్, దిల్షద్ గార్డెన్స్, దిల్షద్ కాలనీ, సీమాపురి, ఝిల్‌మిల్ కాలనీలను హాట్‌స్పాట్లుగా గుర్తించింది. వాటిల్లో కొన్నింటిని కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించింది.

Recommended Video

Shreyas Iyer Was Taken To A Sports Psychologist During His Teenage. Here's Why?

English summary
Vardhaman Apartments in Mayur Vihar Phase I Extension and Mayurdhwaj Apartments in I.P Extension and Lane No. 9 in Pandav Nagar have been declared as 'containment zones' by the Delhi Government. All movements will be completely barred from the areas, to prevent the spread of Coronavirus. All movements will be completely barred from the apartments, to prevent the spread of Coronavirus. Yesterday Delhi Govt identified 20 hotspots and sealed them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X