• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీకి విదేశీ అభినందనలు షురూ! మొద‌టగా శుభాకాంక్షలు చెప్పిన‌దెవ‌రంటే..?

|

న్యూఢిల్లీ: దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. పూర్తిస్థాయిలో ఫ‌లితాలు ఇంకా వెల్ల‌డి కావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తే.. కేంద్రంలో భార‌తీయ జ‌న‌తాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి మెజారిటీ స్థానాల కంటే అధిక సీట్లలో ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మ‌ని తేలింది. దీనితో ఆయ‌న‌కు వివిధ దేశాధినేత‌ల నుంచి అభినందలు అందుతున్నాయి. మొట్ట‌మొద‌ట‌గా- చైనా దేశాధ్య‌క్షుడు గ్జి జిన్‌పింగ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు రాజ‌ధాని బీజీంగ్‌లో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

17వ లోక్‌స‌భ‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూట‌మి అధికారంలోకి రావ‌డం ప‌ట్ల అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని జిన్‌పింగ్ తెలిపారు. భార‌త్‌, చైనాలు అభివృద్ధి చెందిన అతిపెద్ద దేశాల‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచ దేశాల్లో ఆర్థిక శ‌క్తిగా ఎదుగుతున్నాయ‌ని చెప్పారు. చైనా- భార‌త్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అయ్యాయని ఆయన అన్నారు.

Various Contries Presidents and Prime Ministers sent telegram to Modi for his Victory in the Elections

చైనా, భార‌త్ మ‌ధ్య అంత‌ర్జాతీయ సంబంధాల విష‌యంలో చ‌క్క‌ని స‌మ‌న్వ‌యం, స‌హ‌కారం, సుహృద్భావ వాతావ‌ర‌ణం నెల‌కొని ఉందని, దీన్ని కొన‌సాగిస్తామ‌ని జిన్‌పింగ్ అన్నారు. దౌత్య‌ప‌ర‌మైన అంశాలను ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న‌తో బ‌లోపేతం చేసుకుంటామ‌ని చెప్పారు.

Various Contries Presidents and Prime Ministers sent telegram to Modi for his Victory in the Elections

ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌, జ‌పాన్ ప్ర‌ధాన‌మంత్రి షిన్జో అబే, ఇజ్రాయిల్ ప్ర‌ధాన‌మంత్రి నెత‌న్యాహు, శ్రీలంక ప్ర‌ధాన‌మంత్రి ర‌ణిల్ విక్ర‌మ‌సింఘె, ఆఫ్ఘ‌నిస్థాన్ ప్ర‌ధాన‌మంత్రి ఘ‌నీ, భూటాన్ రాజు జిగ్మే ఖేస‌ర్ వాంగ్‌ఛుక్‌, మాల్దీవుల ప్ర‌ధాని ఎఫ్ఎం ష‌హీద్, నేపాల్ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి తొలుత‌గా న‌రేంద్ర మోడీని అభినందించిన వారిలో ఉన్నారు.

Various Contries Presidents and Prime Ministers sent telegram to Modi for his Victory in the Elections

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Russia's President Vladimir, Japanese PM Shinzō Abe congratulates, Russia's President Vladimir Putin, King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck, Afghanistan President Ashraf Ghani, Prime Minister of Nepal, K P Sharma Oli sends congratulatory telegram to PM Narendra Modi in connection "with the convincing victory of the BJP at the general parliamentary elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more