వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక బంద్: తమిళ నేత జయలలిత ఫొటో పెట్టి పిండ ప్రదానం

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మేకేదాటు రిజర్వాయర్ నిర్మాణాన్ని తమిళనాడు ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపిస్తూ కన్నడ సంఘాలు మండిపడుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి వత్యిరేకంగా శనివారం కర్ఱాటక బంద్ కు పిలుపునివ్వడంతో శనివారం ఉదయం 6 గంటల నుండి వాహన సంచారం పూర్తిగా స్తంభించింది.

Various Kannada organizations under the banner of 'Kannada Okkuta'

వివిధ ప్రాంతాల నుండి శనివారం వేకువ జామున బెంగళూరు చేరుకున్న ప్రయాణికులు వారి గమ్యస్థానం చేరుకొలేక నానా ఇబ్బందులు ఎదుర్కున్నారు. కేఎస్ఆర్టీసీ, బెంగళూరు నగరంలో సంచరించే బీఎంటీసీ సిటి బస్సులు ఒక్కటి రోడ్ల మీదకు రాలేదు.

Various Kannada organizations under the banner of 'Kannada Okkuta'

ఆటోలు దాదాపుగా నిలిపివేశారు. రోడ్డు మీదకు వచ్చిన ఒకటి రెండు ఆటోలు మీటర్ డబుల్ చార్జ్ అంటూవసూలు చేసి ప్రయాణికులను లూటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు కన్నడ సంఘాలు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ముఖ్యమంత్రి జయలలిత దిష్టిబోమ్మలు దగ్దం చేశారు.

జయలలితకు పిండప్రదానం !

బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ దగ్గర శనివారం ఉదయం వేలాధి మంది కన్నడిగులు ధర్నా నిర్వహించారు. ఆ సందర్బంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దిష్టి బొమ్మలను దగ్దం చేశారు.

Various Kannada organizations under the banner of 'Kannada Okkuta'

తరువాత హిందూ సంప్రాదాయం ప్రకారం జయలలిత, పన్నీర్ సెల్వం ఫోటోలు పెట్టి పురోహితుల సమక్షంలో పిండం పెట్టారు. తమిళనాడు ప్రభుత్వానికి, జయలలిత, పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు కన్నడ సంఘాల నాయకులు పాల్గోన్నారు.

English summary
Various Kannada organizations under the banner of 'Kannada Okkuta', have called for a Karnataka bandh on Saturday, April 18th to take up Mekedatu drinking water project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X