వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపికి షాక్: వరుణ్‌గాంధీ కాంగ్రెస్‌లోకి? చక్రం తిప్పుతున్న ప్రియాంక

బిజెపి ఎంపీ వరుణ్‌గాంధీ ఆ పార్టీకి షాకివ్వనున్నారా, అంటే అవుననే వార్తలు విన్పిస్తున్నాయి. వరుణ్‌గాంధీ బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ వరుణ్‌గాంధీ ఆ పార్టీకి షాకివ్వనున్నారా, అంటే అవుననే వార్తలు విన్పిస్తున్నాయి. వరుణ్‌గాంధీ బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.రాహుల్ గాంధీ వరుణ్‌గాంధీని కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు చక్రం తిప్పుతున్నారని ప్రచారం సాగుతోంది.

వరుణ్ గాంధీ బిజెపిని వీడే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఉత్తర్ ‌ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత వరుణ్‌గాంధీని పక్కన పెట్టారనే వరుణ్ గాంధీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తైన తర్వాత రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు రాగానే వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

 వరుణ్‌గాంధీ కాంగ్రెస్‌లోకి

వరుణ్‌గాంధీ కాంగ్రెస్‌లోకి

బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీని తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వరుణ్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వరుణ్‌గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్స్ ఉందంటూ ప్రచారం సాగుతోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

 సిడబ్యుసిలోకి వరుణ్ గాంధీ

సిడబ్యుసిలోకి వరుణ్ గాంధీ

2019 పార్లమెంట్‌ ఎన్నికల నాటికి వరుణ్‌ గాంధీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోకి చేరతారని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మంజూర్‌ అహ్మద్‌ అభిప్రాయపడ్డారు. రాహుల్‌, వరుణ్‌లు ఇరువురూ కలసి కాంగ్రెస్‌ను ముందుకు నడిపిస్తారని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం నెలకొందని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ వరుణ్ కోసం చక్రం తిప్పుతున్నారని సమాచారం.

ప్రియాంకతో వరుణ్‌కు సత్సంబంధాలు

ప్రియాంకతో వరుణ్‌కు సత్సంబంధాలు

ప్రియాంక వాద్రాతో వరుణ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. వరుణ్‌ను పార్టీలోకి తీసుకురావడంలో ఆమె కీలకపాత్ర పోషించనున్నారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరరు

వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరరు

వరుణ్‌ కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలను రాజకీయ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. మోడీ కేబినేట్‌లో మనేకా గాంధీ మంత్రిగా పనిచేస్తున్నారు. అంతేకాదు సోనియా గాంధీకి మేనకా గాంధీ కుటుంబంతో విభేదాలు ఉన్నాయంటున్నారు. ఈ కారణాల రీత్యానే వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదంటున్నారు.

యూపీ పీఠం దక్కలేదనే

యూపీ పీఠం దక్కలేదనే

వరుణ్‌ గాంధీకి ముఖ్యమంత్రి అయ్యే నాయకత్వ లక్షణాలున్నా బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను పక్కన పెట్టిందని ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనంతరం ముఖ్యమంత్రిగా వరుణ్‌ పేరును ప్రకటిస్తారని బీజేపీ కార్యకర్తలు అనుకున్నారని యూపీ కాంగ్రెస్‌ నాయకుడు జమీలుద్దీన్‌ చెప్పారు. వరుణ్‌కు ఫాలోయింగ్‌ ఉన్నా ఆయనను కీలక స్థానంలో కూర్చొబెట్టడం ఇష్టం లేకే బీజేపీ ఇలా చేసిందని వ్యాఖ్యానించారు.

English summary
Varun has always been critical of any missteps taken by the Modi government and this may also be the reason why Varun is not being given any priority in the BJP.With Rahul Gandhi more or less set to take over the party president's post in Congress, rumours are rife that he would welcome estranged cousin and Bharatiya Janata Party (BJP) MP Varun Gandhi to join India's Grand Old Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X