వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశోక్ గెహ్లట్‌కు వసుంధర రాజే మద్దతు..?: బీజేపీ మిత్రపక్ష ఎంపీ సంచలన వ్యాఖ్యలు, రాజస్తాన్ రాజకీయాల్లో

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ అస్థిరత్వం కంటిన్యూ అవుతోంది. పూటకో మలుపు, రోజుకో ట్విస్ట్ వస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్ష ఎంపీ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ సీఎం వసుంధర రాజే మాత్రం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్‌కు సపోర్ట్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఎంపీ హనుమాన్ బెనివాల్ ట్విట్ రాజస్తాన్ రాజకీయాల్లో దుమారం రేపింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అబ్బే అదేం లేదని కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ వసుంధర రాజే మిన్నకుండిపోవడం మాత్రం హనుమాన్ కామెంట్లకు బలం చేకూరుస్తోంది.

రంగంలోకి రాజే: రాజస్తాన్ రాజకీయాల్లో కీలక మలుపు, కమలదళ పెద్దలతో వసుంధర భేటీ, పైలట్‌తో చర్చలు..?రంగంలోకి రాజే: రాజస్తాన్ రాజకీయాల్లో కీలక మలుపు, కమలదళ పెద్దలతో వసుంధర భేటీ, పైలట్‌తో చర్చలు..?

సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

రాజస్తాన్‌లో అశోక్ గెహ్లట్ ప్రభుత్వం అంపశయ్యపై కొనసాగుతోంది. సచిన్ పైలట్ తిరుగబాటుతో గెహ్లట్ అండ్ కో గుక్క తిప్పుకొని పరిస్థితి. ఈ సమయంలో బీజేపీ కూడా వేగంగా పావులు కదపలేని పరిస్థితి. ఎందుకంటే పైలట్ తప్ప మిగతా చిన్న చితక పార్టీలను కలుపుకొన్న మెజార్టీ సరిపోదు. దీంతోపాటు వసంధర రాజే సైలంట్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైలట్ శిబిరాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అదేం లేదు: బీజేపీ

అదేం లేదు: బీజేపీ

హనుమాన్ కామెంట్లతో బీజేపీ వెంటనే స్పందించింది. ఆయన ఇలా మాట్లాడటం సరికాదని రాజస్తాన్ బీజేపీ చీఫ్ సతీశ్ పునియా పేర్కొన్నారు. తమ ప్రతినిధులు అతనితో మాట్లాడారని.. వసుంధర రాజే తమ నేత అని పేర్కొన్నారు. అయితే మధ్యప్రదేశ్ మాదిరిగా వేగంగా స్పందించడంలో రాజే విఫలమయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మాదిరిగా కాకుండా మిన్నకుండిపోయారు. మంగళవారం హైకమాండ్ పెద్దలతో కూడా సమావేశం కాలేదు. దీంతో కాంగ్రెస్ కూడా జాగ్రత్త పడుతోంది. పైలట్‌ను బుజ్జగించే ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.

 హై కమాండ్ కోరితేనే..

హై కమాండ్ కోరితేనే..

వాస్తవానికి సచిన్ పైలట్ సహా 18 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ భేటీకి హాజరుకాలేదు. ఒకవేళ బలనిరూపణ చేస్తే గెహ్లట్ ప్రభుత్వం మైనార్టీలోకి వెళుతుంది. కానీ బీజేపీ కూడా బల నిరూపణ కోరడం లేదు. దీనిపై బీజేఎల్పీ నేత గులాబ్ చంద్ స్పందిస్తూ.. గెహ్లట్ ప్రభుత్వాన్ని బలనిరూపణ పిలువాల్సిన అవసరం లేదు అని కామెంట్ చేశారు. ఒకవేళ పిలవాలనిపిస్తే.. పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దీంతో తెరవెనక రాజే... ముందుకురాకపోవడం ఒక కారణం అని కూడా అనుకొవచ్చు.

ఎవరీ వాదన వారిదే..

ఎవరీ వాదన వారిదే..

అసెంబ్లీలో బలనిరూపణ చేస్తేనే బలబలాలు తెలుస్తాయి. గెహ్లట్ తనకు 107 మంది సభ్యులు ఉన్నారని చెబుతుండగా.. పైలట్ తనతో 19 నుంచి 20 మంది ఉంటున్నారని ప్రకటిస్తున్నారు. ఎవరి లెక్కలు వారు వేసుకోవడంతో.. ఏదీ నిజమో తెలియడం లేదు. వాస్తవానికి పైలట్‌తో బీజేపీ సంప్రదింపులు జరిపింది. ఆయన సీఎం పోస్టు కోరడంతో ఇస్తామని చెప్పలేకపోయింది.

Recommended Video

Sachin Pilot కు అశోక్ గెహ్లాట్ చురకలు! || Oneindia Telugu
సీఎం పోస్టు కోరడంతోనే

సీఎం పోస్టు కోరడంతోనే

వసుంధర రాజేనే కారణం. 73 మంది సభ్యుల్లో 45 మంది వరకు రాజేను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలే.. వారిని కాదని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. అందుకోసం బీజేపీ మిన్నకుండిపోగా.. రాజే కూడా పైలట్ కాకుండా గెహ్లట్ ప్రభుత్వం కంటిన్యూ అయ్యేందుకు దోహదపడుతున్నారని తెలుస్తోంది. ఈక్రమంలోనే బీజేపీ పక్ష ఎంపీ కామెంట్లు కలకలం రేపాయి.

English summary
BJP ally in Rajasthan has alleged that former Chief Minister Vasundhara Raje, is trying to help Chief Minister Ashok Gehlot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X