వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్తాన్ రాజకీయాల్లో సైలంట్‌గా వసుంధర రాజే, సోషల్ మీడియాకు కూడా, కారణమిదేనా..?

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు జరుగుతోన్నాయి. బయటకి ఆత్మభిమానం, ఆత్మగౌరవం అని అంటోన్న.. లోన మాత్రం ముఖ్యమంత్రి పీఠం. సచిన్ పైలట్ తిరుగబాటుకు కూడా కారణం అదే, అంతేకాదు సచిన్ ధిక్కార స్వరం తర్వాత అతనితో బీజేపీ సంప్రదింపులు జరిపిందని వార్తలొచ్చాయి. అతను సీఎం పోస్టు అడగడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వసుంధర రాజేని కాదని బీజేపీ హై కమాండ్ ఏం చేయలేని పరిస్థితి. దీనిని బీజేపీ ఉద్దండ నేతలు కూడా అంగీకరించాల్సిందే. బీజేపీకి ఉన్న 73 మంది ఎమ్మెల్యేలలో 45కి పైచిలుకు రాజే కనుసన్నల్లో పనిచేసేవారు. అందుకే బీజేపీ సైలంట్‌గా ఉంది.

అశోక్ గెహ్లట్‌కు వసుంధర రాజే మద్దతు..?: బీజేపీ మిత్రపక్ష ఎంపీ సంచలన వ్యాఖ్యలు, రాజస్తాన్ రాజకీయాల్లోఅశోక్ గెహ్లట్‌కు వసుంధర రాజే మద్దతు..?: బీజేపీ మిత్రపక్ష ఎంపీ సంచలన వ్యాఖ్యలు, రాజస్తాన్ రాజకీయాల్లో

సైలంట్‌గా రాజే.. కారణమిదే..?

సైలంట్‌గా రాజే.. కారణమిదే..?


బీజేపీతోపాటు రాజే కూడా సైలంట్‌గా ఉన్నారు. ఎందుకంటే పైలట్‌ను బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని భావిస్తే.. తనకే మేకై కూర్చొంటాడని భావిస్తోన్నారు. అందుకే బీజేపీ అధికారం చేపట్టేందుకు అడుగులు వేయడం లేదు. గెహ్లట్‌కు కాస్త అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనిని బలపరుస్తూ బీజేపీ మిత్రపక్ష ఎంపీ హనుమాన్ ట్వీట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిస్తున్న రాజే ప్రవర్తన కూడా ఉంది. కాంగ్రెస్ పరిణామాలపై ఆమె నోరు మెదపడం లేదు. బహిరంగంగా మాట్లాడకున్నా సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేయడం అనుమానాలు నిజమేనని అనిపిస్తోంది.

 మిగతా నేతలు.. మాత్రం

మిగతా నేతలు.. మాత్రం

రాజస్తాన్ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరుగుతోన్న పరిమాణాలను ఫైర్ బ్రాండ్ రాజే కాకుండా.. మిగతా నేతలు మాత్రం స్పందిస్తున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఓం మాథుర్, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పునియా ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు గెహ్లట్ ప్రభుత్వానికి మద్దతు లేదని, బల నిరూపించుకోవాలని కూడా కోరడం లేదు. ఇందుకు కూడా వసుంధర.. గెహ్లట్ ప్రో ఉండటమే కారణం. పైలట్ కన్నా గెహ్లట్‌కు మద్దతిచ్చి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవాలని వసుంధర భావిస్తోంది.

 గెహ్లట్ ఫినిష్..

గెహ్లట్ ఫినిష్..

మిగతా నేతలు మాత్రం అశోక్ గెహ్లట్ ప్రభుత్వం పని అయిపోయిందని చెబుతున్నారు. రోజులు దగ్గర పడ్డాయని, ప్రభుత్వం పతనం దశకు వచ్చిందని తెలిపారు. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. మాజీ సీఎం వసుంధర రాజే మాత్రం.. సైలంట్‌గా ఉన్నారు. ఈ విషయం బీజేపీ పెద్దలకు తెలిసినా.. మెజార్టీ ఎమ్మెల్యేలు రాజే పక్షాన నిలవడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
రాజే కనుసన్నల్లో

రాజే కనుసన్నల్లో

రాజస్తాన్‌లో బీజేపీకి 73 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 45 మంది వరకు రాజేను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలే.. వారిని కాదని ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం. అందుకోసం బీజేపీ మిన్నకుండిపోగా.. రాజే కూడా సచిన్ పైలట్ కాకుండా గెహ్లట్ ప్రభుత్వం కంటిన్యూ అయ్యేందుకు పరోక్షంగా సహకరిస్తున్నారని మీడియా కోడై చూస్తుంది. వాస్తవానికి రాజే కూడా రాజస్తాన్ ప్రభుత్వ సంక్షోభంపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

English summary
vasundhara raje has remained conspicuposly silent on the political crisis in the state even as her party colleagues have spoken on the developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X