• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలుగు తేజం వీణారెడ్డికి కీలక పదవి -భారత్‌లో అమెరికా ఎయిడ్ డైరెక్టర్ -కొవిడ్ సాయానికి బైడెన్ హామీ

|

భారత ప్రధాని నరేంద్ర మోదీ బాహాటంగా డొనాల్డ్ ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, అగ్రరాజ్యానికి జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాలోని భారత సంతతి వ్యక్తులకు వరుసగా కీలక పదవులు, అందలాలు దక్కుతున్నాయి. ప్రభుత్వ విభాగాలతోపాటు అంతర్జాతీయ సంస్థల్లోనూ మనోళ్లకు ప్రాధాన్యం దక్కుతున్నది. తాజాగా భార‌త్‌-అమెరికా సంత‌తికి చెందిన వీణా రెడ్డి.. మ‌న దేశానికి యూఎస్ ఎయిడ్ ఏజెన్సీ మిష‌న్ డైర‌క్ట‌ర్‌గా ఎంపిక‌య్యారు. భార‌త్‌తో పాటు భూటాన్‌లో ఆమె సేవ‌లు అందించ‌నున్నారు.

  Indian Americans సత్తా.. తెలుగు బిడ్డ Veena Reddy కీలక పదవులు | Rashad Hussain || Oneindia Telugu

  అమెరికా సీనియ‌ర్ ఫారిన్ స‌ర్వీస్‌లో స‌భ్యురాలు అయిన వీణా రెడ్డి.. మ‌న తెలుగు అమ్మాయి కావ‌డం విశేషం. భార‌త్‌కు యూఎస్ ఎయిడ్ మిష‌న్ డైరక్ట‌ర్‌గా ఆమె ఇవాళ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. యూఎస్ ఎయిడ్ త‌ర‌పున ఇండియాలో సేవ‌లు అందించ‌నున్న తొలి భార‌తీయ అమెరిక‌న్‌గా ఆమె రికార్డు నెల‌కొల్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టిన వీణారెడ్డి.. యూఎస్ ఫారిన్ స‌ర్వీస్‌లో త‌న కెరీర్‌ను ప్రారంభించారు. గ‌తంలో ఆమె కంబోడియాలో యూఎస్ ఎయిడ్ మిష‌న్ డైర‌క్ట‌ర్‌గా చేశారు. హైతిలోనూ డిప్యూటీ మిష‌న్ డైరక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

  veena-reddy-takes-over-as-first-indian-american-head-of-usaid-in-india

  అమెరికా ప్ర‌భుత్వంలో ఉద్యోగం సంపాదించ‌డానికి ముందు.. వీణా రెడ్డి కార్పొరేట్ కంపెనీలో అటార్నీగా చేశారు. కొలంబియా లా యూనివ‌ర్సిటీ నుంచి డాక్ట‌రేట్ చేశారామె. చికాగో వ‌ర్సీటీలో బీఏ చేశారు. యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫ‌ర్ ఇంట‌ర్నేష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట్ ) భార‌త ప్ర‌భుత్వంతో గ‌త ఏడు ద‌శాబ్ధాల నుంచి భాగ‌స్వామిగా ఉంద‌ని, ఈ బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆమె అన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఇండియాతో పాటు ఇత‌ర దేశాల‌పైన తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని, రెండు దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యంతో మెరుగైన భ‌విష్య‌త్తును నిర్మించ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. కాగా,

  భారత్‌లో అమెరికా ఎయిడ్ డైరెక్టర్ గా వీణా రెడ్డి నియామకానికి కొద్ది రోజుల ముందే, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరో భారతీయ అమెరికన్‌ రషద్‌ హుస్సేన్‌ను అంతర్జాతీయ మత స్వేచ్ఛ అంబాసిడర్‌గా నామినేషన్‌ చేశారు. ఈ పదవికి ఎంపికైన తొలి ముస్లింగా రషద్‌ నిలిచారు. రషద్‌ హుస్సేన్ జాతీయ భద్రతా మండలిలో భాగస్వామి, అలాగే గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ డైరెక్టర్. ఆయన గతంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ నేషనల్ సెక్యూరిటీ డివిజన్‌లో సీనియర్ కౌన్సెల్‌గా పనిచేశారని వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. ఒబామా హయాంలో స్ట్రాటజిక్ కౌంటర్ టెర్రరిజం కమ్యూనికేషన్స్, డిప్యూటీ అసోసియేట్ వైట్ హౌస్ కౌన్సిల్ కోసం ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) కు అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా రషద్ సేవలందించారు.

  రాయబారిగా.. హుస్సేన్ విద్య, వ్యవస్థాపకత, ఆరోగ్యం, అంతర్జాతీయ భద్రత, సైన్స్, టెక్నాలజీ, ఇతర రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించడానికి ఇస్లామిక్ సహకారం (OIC), ఐక్యరాజ్యసమితి, విదేశీ ప్రభుత్వాలు, పౌర సమాజ సంస్థల్లోనూ పని చేశారు. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో చేరడానికి ముందు ఆరో సర్క్యూట్ యూఎస్‌ అప్పీల్స్ డామన్ కీత్‌కు జ్యుడీషియల్ లా క్లర్క్‌గా పనిచేశాడు. ఒబామా-బిడెన్ ట్రాన్సిషన్ ప్రాజెక్ట్‌కి అసోసియేట్ కౌన్సెల్‌గా కూడా ఉన్నారు. హుస్సేన్ యేల్ లా స్కూల్ నుంచి లా డిగ్రీ.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరబిక్, ఇస్లామిక్ అధ్యయనాలు చేసి మాస్టర్స్ డిగ్రీని పొందారు. రషద్‌ నియామకంపై అమెరికన్‌ యూదు కమిటీ (AJC) యునైటెడ్ స్టేట్స్ అంబాసిడర్‌గా నియమించినందుకు బిడెన్ పరిపాలనను ప్రశంసించింది. ఇదిలా ఉంటే,

  భారత్‌ సహా ఇతర దేశాలకు కరోనా టీకాల ఉత్పత్తిలో అమెరికా సహాయసహకారాలు అందిస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు 50 కోట్ల డోసులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఈ నెలాఖరులో వాటి పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. తాము చేసే సాయం పూర్తిగా ఉచితమన్నారు. శ్వేతసౌధంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈమేరకు మాట్లాడారు.

  కరోనా ఉద్ధృతిని నివారించడంలో ప్రజాస్వామ్య దేశాల కృషి కీలకమన్నారు. కరోనాపై పోరులో టీకాల భాండాగారంగా నిలవాలని అమెరికా సంకల్పించిందన్నారు. కోవాక్స్‌ కార్యక్రమానికి ఇతర దేశాలకన్నా అధికంగా టీకాలు అందించామన్నారు. క్వాడ్‌ కూటమిలోని సహ సభ్య దేశాలైన భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలకు టీకాల ఉత్పత్తిలో సహకారం అందించినట్లు చెప్పారు. 8 కోట్ల డోసుల పంపిణీ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఇప్పటివరకూ 65 దేశాలకు 11 కోట్ల డోసులు అందించామన్నారు. అమెరికన్లకు టీకాలు వేయడం, ఇతర దేశాల ప్రజలకు టీకాలు అందడంలో సాయం చేయడం తమ ముందున్న లక్ష్యాలని చెప్పారు. మరోవైపు,

  veena-reddy-takes-over-as-first-indian-american-head-of-usaid-in-india

  2030 కల్లా అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అమెరికా మాజీ దౌత్య వేత్త రిచర్డ్ వర్మ అభిప్రాయపడ్డారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికా కలిసి ఎంతో సాధించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. జిందాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ''ఆసియా దేశాల్లోకెల్లా భారత్‌లోనే ఉద్యోగ వయస్సున్న యువత సంఖ్య అధికంగా ఉంది. భారత్‌కు ఈ సానుకూలత 2050 వరకూ కొనసాగుతుంది'' అని ఆయన తెలిపారు. భారత్‌కు అమెరికా రాయబారిగా వచ్చిన తొలి భారతీయ సంతతి వ్యక్తి రిచర్డ్ వర్మ అన్న విషయం తెలిసిందే.

  English summary
  Veena Reddy, a career member of the US senior foreign service, has taken over as the first Indian American mission director of the US Agency for International Development (USAID) in India. US helping India, other countries to produce vaccines by themselves, says President Joe Biden
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X