వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలకు షాక్: వీరశైవ మహాసభ డిమాండ్, 17 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బుధవారం జేడీఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి పదవుల పంపకంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించడానికి, వారిని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడానికి కుమారస్వామి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్బంలో అఖిల భారత వీరశైవ మహాసభ నాయకులు కాంగ్రెస్- జేడీఎస్ లకు లేఖరాసి పలు డిమాండ్లు తీర్చాలని పత్రికా ప్రకటన విడుదల చేశారు. 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, 6 మందికి కీలక పదువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వీరశైవ మహాసభ అధ్యక్షుడు

వీరశైవ మహాసభ అధ్యక్షుడు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వీరశైవ మహాసభ అధ్యక్షుడు శామనూరు శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అఖిల భారత వీరశైవ మహాసభ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. శామనూరు శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని కాంగ్రెస్, జేడీఎస్ నాయకులకు వీరశైవ మహాసభ నాయకులు లేఖ రాశారు.

17 మంది ఎమ్మెల్యేలు

17 మంది ఎమ్మెల్యేలు

అఖిల భారత వీరశైవ మహాసభ మొదటి నుంచి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తోందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. వీరశైవ-లింగాయుత కులానికి చెందిన 17 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తాము గెలిపించామని, అందువలన శామనూరు శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశారు.

5 మంత్రి పదవులు

5 మంత్రి పదవులు

శామనూరు శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు కాంగ్రెస్- జేడీఎస్ పార్టీలలోని వీరశైవ-లింగాయుత కులస్తులకు కనీసం 5 మంత్రి పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీరశైవ-లింగాయుత కులస్తులను కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం గౌరవించాలని ఈ సందర్బంగా అఖిల భారత వీరశైవ మహాసభ నాయకులు డిమాండ్ చేశారు.

చీలిపోకుండా జాగ్రత్తలు

చీలిపోకుండా జాగ్రత్తలు

వీరశైవ-లింగాయుత ఎమ్మెల్యేలు చీలిపోకుండా కాంగ్రెస్- జేడీఎస్ లు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎలాగైనా వీరశైవ-లింగాయుత ఎమ్మెల్యేలలో చీలిక తీసుకురావాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తారని పసిగట్టిన కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు వారికి మంత్రి పదవుల్లో ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

వీరశైవ మహాసభ ప్లాన్

వీరశైవ మహాసభ ప్లాన్


మా డిమాండ్లు తీర్చకపోతే తరువాత మా నిర్ణయం మేము తీసుకుంటామని అఖిల భారత వీరశైవ మహాసభ నాయకులు అంటున్నారు. శ్యామనూరు శివశంకరప్పకు ఉప ముఖ్యమంత్రి పదవి, వీరశైవ-లింగాయుత ఎమ్మెల్యేలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వనిపక్షంలో తాము ఆలోచించవలసి వస్తోందని అంటున్నారు. మొత్తం మీద అప్పుడే కులాల వారిగా మంత్రిపదువులను డిమాండ్ చేసే వారు మొదలైనారు.

English summary
Veerashiva mahasabha writes letter and demands to give deputy chief minister post to Veerashiva Lingayatha president Shamanur Shivashankarappa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X