బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 7.5 కోట్ల బ్యాంకు నగదు: హైవేలో ఉద్యోగులతో సహ కారు మాయం ! ఏం జరిగింది ?

ప్రైవేట్ బ్యాంకు నుంచి బెంగళూరుకు రూ. 7.5 కోట్లు తరలిస్తున్న వాహనంతో సహ నలుగురు ఉద్యోగులు కర్ణాటకలో మాయం అయ్యారు. నగదు ఉన్న వాహనంతో సహ నలుగురు ఉద్యోగులు మాయం కావడంతో మంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి ద

|
Google Oneindia TeluguNews

మంగళూరు/బెంగళూరు: ప్రైవేట్ బ్యాంకు నుంచి బెంగళూరుకు రూ. 7.5 కోట్లు తరలిస్తున్న వాహనంతో సహ నలుగురు ఉద్యోగులు కర్ణాటకలో మాయం అయ్యారు. నగదు ఉన్న వాహనంతో సహ నలుగురు ఉద్యోగులు మాయం కావడంతో మంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు గురువారం మంగళూరులోని యయ్యాడి బ్యాంకు బ్రాంచ్ నుంచి రూ. 7.5 కోట్ల నగదును బెంగళూరు నగరంలోని కోరమంగల ఆక్సిస్ బ్యాంకుకు తరలించడానికి సిద్దం అయ్యారు. 7.5 కోట్ల రూపాయల నగదు బోలెరో వాహనంలో పెట్టారు.

Vehicle loaded with Rs 7.5 crore meant for private bank missing

డ్రైవర్ కరిబసవ, అధికారి పరుశురామ్, గన్ మ్యాన్ లు పూవప్ప, బసప్ప నగదు ఉన్న వాహనంలో మంగళూరు- బెంగళూరు జాతీయ రహదారిలో బయలుదేరారు. అయితే నగదుతో బయలుదేరిన ఉద్యోగులు మరసటి రోజు (శుక్రవారం) అయినా బెంగళూరులోని కోరమంగల బ్రాంచ్ చేరుకోలేదు.

నగదు ఉన్న వాహనంతో సహ నలుగురు ఉద్యోగులు మాయం అయ్యారు. నలుగురు ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో బ్యాంకు అధికారులు మంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మిస్టరీగా మారిన ఈ కేసు విచారణ అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నగదుతో సహ మాయం అయిన నలుగురు బ్యాంకులకు నగదు తరలించే ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అని తెలిసింది.

English summary
Rs 7.5 crore belonging to a private bank which was being transported from Mangaluru to Bengaluru has gone missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X