వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పొల్యూషన్ చెక్‌’పై 18శాతం జీఎస్టీ చెల్లించాలి: ఏఏఆర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వాహనాలకు తీసుకునే కాలుష్యం స్థాయి ధృవీకరణ పత్రానికి 18శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్) మంగళవారం విడుదల చేసింది.

వాహనదారులకు ప్రభుత్వం తరపున పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) ధృవీకరణ పత్రం జారీ చేసేందుకు అందించే సేవలకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉందా? అంటూ వెంకటేశ్ ఆటోమొబైల్స్ అనే సంస్థ ఏఏఆర్‌కు దరఖాస్తు చేసుకుంది.

 Vehicle owners to pay 18% under GST on pollution check

ఈ దరఖాస్తుపై స్పందించిన ఏఏఆర్ గోవా బెంచి.. ఆ సేవలకు జీఎస్టీ నుంచి ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది. కాలుష్య స్థాయిని తెలిపే ధృవీకరణ పత్రం జారీకై సంస్థలు చేసే కార్యకలాపాలు సర్వీసెస్ అకౌంట్ కోడ్ 9991 పరిధిలోకి రావని ఏఏఆర్ తెలిపింది. అందువల్ల వాటికి జీఎస్టీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

వాహనదారులు ఆ పత్రాన్ని తీసుకోవాలంటే 18శాతం జీఎస్టీ చెల్లించాలని వివరించింది. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనానికి పీయూసీ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని ఏఏఆర్ తెలిపింది.

English summary
Vehicle owners will have to pay a GST of 18 per cent to get pollution certificate for their vehicles, the Authority for Advance Ruling (AAR) has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X