వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగుళూరులో ఐస్‌క్రీమ్ ఆశచూపి బాలికపై అత్యాచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Vendor molests 7 year old
న్యూఢిల్లీ: బాలికలు, మహిళలపై అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది. మొన్న ఆర్చిడ్స్ పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై, నిన్న ఇందిరానగర కేంబ్రిడ్జి పాఠశాలలో మరో చిన్నారిపై కొనసాగిన దాష్టీకాలు మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఐస్ క్రీమ్ ఆశ చూపి 7ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ 35 ఏళ్ల ఐసీ క్రీమ్ విక్రేతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే అక్టోబర్ 15న చిన్నారి ఆడుకునేందుకు పక్కనే ఉన్న తన స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లింది.

తనతో పాటు తన స్నేహితురాలితో ఆట మైదానంలో ఆడుకొంటుండగా... ఐస్ క్రీమ్ విక్రేత అయిన నాగ్ రాజ్ కళ్లు ఆ చిన్నారిపై పడ్డాయి. వెంటనే ఐస్ క్రీమ్స్ ఆశ చూపి చిన్నారిని సమీపంలో ఉన్న తాత్కాలిక ఇంటికి తీసుకెళ్లి పలు మార్లు ముద్దు పెట్టుకోని.. చిన్నారిపై లైంగికంగా అత్యాచారానికి పాల్పడ్డ పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఆదివారంనాడు చిన్నారిని ఇంటికి సమీపంలో మొక్క జొన్న విక్రతే వస్తే కొనుక్కొమని చెప్పగా ఆ చిన్నారి నిరాకరించింది. దీంతో పలు మార్లు తల్లితో ఆ చిన్నారి గొడవ పడింది.

అలా గొడవ తర్వాత తల్లి ఆ చిన్నారిని గట్టిగా ప్రశ్నించగా... ఐస్ క్రీమ్ విక్రేత తనను లైంగికంగా ఎలా వేధించడానే విషయాన్ని చెప్పింది. దీంతో చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎలక్ట్రానిక్ పోలీసులు ఐస్ క్రీమ్ విక్రేత నాగ్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 354, లైంగిక వేధింపుల నేరం కింద కేసు నమోదు చేశాని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

English summary
A seven-year-old girl, who went to play at a neighbour’s house, was molested by a 35-year-old man in Begur under Electronic City police station limits a fortnight ago, but the incident came to light on Sunday after the victim told her mother about it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X