వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపరేషన్ థియేటర్ లో ఇద్దరు డాక్టర్ల ఫైటింగ్: తల్లి కడుపులోనే బిడ్డ మృతి (వీడియో)

ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో నిండుగర్బిణికి శాస్త్ర చికిత్స చేసే సమయంలో ఇద్దరు డాక్టర్లు గొడవపడటంతో పండంటి బిడ్డ మరణించిన దారుణ ఘటన రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగింది.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Doctors Fighting During An Emergency Cesarean తల్లి కడుపులోనే బిడ్డ మృతి : Video | Oneindia Telugu

జైపూర్: ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో నిండుగర్బిణికి శాస్త్ర చికిత్స చేసే సమయంలో ఇద్దరు డాక్టర్లు గొడవపడటంతో పండంటి బిడ్డ మరణించిన దారుణ ఘటన రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగింది. పురిటిబిడ్డ మరణించడానికి కారణం అయిన ఇద్దరు డాక్టర్లను విధుల నుంచి తప్పించారు.

జోథ్ పూర్ లో ఉమైద్ ఆసుపత్రిలో మంగళవారం నిండుగర్బిణికి అత్యవసర శాస్త్ర చికిత్స చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్ లోని బెడ్ మీద నిండుగర్బణిని పడుకోపెట్టి శాస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో గర్బణి ఏమైనా ఆహారం తీసుకున్నారా అంటూ డాక్టర్ అశోక్ నైన్ వాల్ ప్రశ్నించారు.

ఆ సమయంలో ఎవ్వరూ ఏమీ సమాధానం ఇవ్వకపోవడంతో డాక్టర్ ఎంఎల్, తాక్ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన తరువాత ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తియ్యాలని సూచించారు. గర్బిణికి వైద్యపరీక్షలు చెయ్యడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన డాక్టర్ అశోక్ ఆమెకు శాస్త్ర చికిత్స చెయ్యడానికి సిద్దం అయ్యారు.

ఆ చిన్న విషయంలో డాక్టర్ అశోక్, డాక్టర్ ఎంఎల్. తాక్ గొడవపడ్డారు. గర్బిణికి అత్యవసర శాస్త్ర చికిత్స చెయ్యకుండా ఇద్దరు డాక్టర్లు గడవ పడుతున్న సమయంలో మరో డాక్టర్ ఆ తతంగం మొత్తం మొబైల్ లో వీడియో తీశారు. అక్కడ ఉన్న నర్సులు కలుగజేసుకుకుని ముందు ఆమెకు ఆపరేషన్ చెయ్యాలని మనవి చేశారు.

చివరికి నిండుగర్బిణికి ఆపరేషన్ చెయ్యగా అప్పటికే పండంటి బిడ్డ తల్లి కడుపులోనే మరణించింది. పురిటి బిడ్డ మరణించడానికి కారణం అయిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తప్పించి విచారణకు ఆదేశాలు జారీ చేశామని రాజస్థాన్ వైద్య శాఖ అధికారులు తెలిపారు.

English summary
A shocking video of Rajasthan doctors fighting inside an operation theatre at Rajasthan’s Umaid Hospital in Jodhpur has gone viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X