వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజ్మీర దర్గ పేలుడు: స్వామి అసిమానంద నిర్దోషి

2007లో చోటు చేసుకున్న అజ్మీర దర్గా పేలుళ్ల కేసులో జైపూర్‌లోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానం బుధవారం నాడు తీర్పు చెప్పింది. స్వామి అసీమానందను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.

|
Google Oneindia TeluguNews

జైపూర్: 2007లో చోటు చేసుకున్న అజ్మీర దర్గా పేలుళ్ల కేసులో జైపూర్‌లోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) న్యాయస్థానం బుధవారం నాడు తీర్పు చెప్పింది. స్వామి అసీమానందను న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది.

మరో ముగ్గురిని మాత్రం నేరస్తులుగా తేల్చింది. సునీల్ జోషి, భావేష్, దేవేంద్రలను తప్పు చేసినట్లుగా తేల్చింది. కాగా, ఈ పేలుడులో ముగ్గురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ఈ కేసును 2011లో ఎన్ఐఏ చేతికి ఇచ్చింది.

 Ajmer dargah blast

ఈ కేసు ఎన్నో మలుపులు తిరిగింది. పోలీసులు తొలుత ఈ పేలుడుకు ఓ వ్యక్తిని అనుమానించారు. హర్కత్ ఉల్ జిహాద్‌కు చెందిన వ్యక్తి ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా భావించారు.

11 అక్టోబర్ 2007లో అజ్మీర దర్గలో బాంబు పేలుడు సంభవించింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల వేటలో పడ్డారు. దేశవ్యాప్తంగా నిందితులను పట్టుకునేందుకు టీంను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం కూడా కోరారు.

English summary
A special National Investigation Agency (NIA) court in Jaipur is scheduled to announce its verdict in 2007 Ajmer dargah bomb blast case on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X