వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ కూల్చివేతపై ఈ నెల 30న తీర్పు- అద్వానీ, జోషీ, ఉమ బయటపడతారా ?

|
Google Oneindia TeluguNews

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. 27 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఈ నెల 30న తీర్పు ప్రకటించనున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది. ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్‌ జోషీ, వినత్‌ కతియార్‌ సహా పలువురి భవితవ్యం తేలాల్సి ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న ఈ కేసు విచారణ నానాటికీ ఆలస్యమవుతూ వచ్చింది. పలుమార్లు తీర్పు కూడా వాయిదా పడింది. దీంతో విచారణను దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించేందుకు సిద్ధమవుతోంది.

బాబ్రీ తీర్పుకు మహుర్తం ఖరారు...

బాబ్రీ తీర్పుకు మహుర్తం ఖరారు...

1992లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ జిల్లాలోని అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులతో కలిసి బీజేపీ అగ్రనేతలు కూల్చివేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. జస్టిస్‌ లిబర్హాన్‌ కమిషన్‌ విచారణ, అనంతరం సీబీఐ విచారణ తర్వాత ఈ అభియోగాలపై సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇందులో భారీ సంఖ్యలో సాక్షులను విచారించడమే కాకుండా, కీలక ఆధారాలను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. బాబ్రీ మసీదు కూల్చివేతపై తుది తీర్పు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన తీర్పును ఈ నెల 30న వెలువరించేందుకు సీబీఐ కోర్టు ఏర్పాట్లు చేస్తోంది.

అయోధ్య తేలినా కూల్చివేత కేసు ఆలస్యం..

అయోధ్య తేలినా కూల్చివేత కేసు ఆలస్యం..

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత నాటకీయ పరిణామాల మధ్య సుదీర్ఘ విరామం తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్యలో రామాలయం నిర్మించాలని కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పుపై ముస్లిం వర్గాలు కూడా అప్పీలు చేయకపోవడంతో వివాదం సద్దుమణిగినట్లయింది. అయితే అయోధ్యలో రామాలయం నిర్మాణం కూడా ప్రారంభమైనా ఇంకా బాబ్రీ మసీదు కూల్చివేతపై తీర్పు వెలువరించకపోవడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా విచారణను త్వరగా ముగించాలని పలుమార్లు సీబీఐ ప్రత్యే్క కోర్టుకు సూచించింది. దీంతో తుది తీర్పు కోసం సీబీఐ కోర్టు భారీ కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ అగ్రనేతల భవితవ్యంపై ఉత్కంఠ...

బీజేపీ అగ్రనేతల భవితవ్యంపై ఉత్కంఠ...

ఈ కేసులో బీజేపీ అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతి, వినయ్‌ కతియార్‌ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదైన నేపథ్యంలో సీబీఐ కోర్టు ఇచ్చే అంతిమ తీర్పు వారికి అత్యంత కీలకం కానుంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఈ తీర్పు కీలకంగా మారింది. అయోధ్య రామాలయం నిర్మాణం తమ ఘనతగా చెప్పుకుంటున్న బీజేపీ.. బాబ్రీ కూల్చివేత విషయంలో మాత్రం తమ నేతలను వెనకేసుకు రాలేని పరిస్ధితి. చట్ట ప్రకారం వీరు విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చే తీర్పు బీజేపీ భవితవ్యంపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావం చూపబోతోంది.

Recommended Video

AgustaWestland : Former CAG & IAF officials విచారణకు అనుమతి కోరిన CBI || Oneindia Telugu
సుప్రీంలో రివ్యూ అవకాశం...

సుప్రీంలో రివ్యూ అవకాశం...


ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐలో సాగుతున్న బాబ్రీ కేసు విచారణ అనంతరం వచ్చే తీర్పు ఉత్కంఠ రేపుతుండగా.. ఏ మాత్రం తేడా వచ్చినా తిరిగి సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ వేసేందుకు సైతం బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే కేసు విచారణ మరింత ఆలస్యం కానుంది. అలా కాకుండా సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పునే సుప్రీంకూడా ఖరారు చేస్తే మాత్రం బీజేపీ అగ్రనేతలకు చిక్కులు తప్పకపోవచ్చు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ అగ్రనేతలు అద్వానీ, జోషీ, ఉమ, కతియార్‌ ఇప్పటికే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బీజేపీలోనూ వీరికి అంతగా ప్రాధాన్యం దక్కడం లేదు.

English summary
A special CBI court has fixed September 30 as the date for the trial in the 1992 Babri Masjid demolition case involving 32 accused, including BJP veterans LK Advani, MM Joshi, Uma Bharti and Vinay Katiyar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X