వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైను వణికిస్తున్న వర్షాలు.. భారీగా వరదనీరు చేరడంతో జనం బెంబేలు..

|
Google Oneindia TeluguNews

ముంబై : ముంబైవాసులను వర్షాలు వదిలిపెట్టడం లేదు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించింది. ఎడతెరిపిలేకుండా వానలు పడుతుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముంబైలో గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల ముప్పు ఇప్పట్లో తప్పేలా కనిపించడంలేదు. శనివారం కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆదివారం సైతం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో ముంబై వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బృహన్‌ముంబై కార్పొరేషన్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే పనిలో పడింది. ఎన్డీఆర్ఎఫ్‌తో పాటు రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

Very Heavy Rain Predicted In Mumbai

ప్రతికూల వాతావరణం ఉన్నందున ప్రజలు సముద్రం దగ్గరకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మ్యాన్ హోల్‌లు ఓపెన్ చేయవద్దని చెప్పారు. శనివారం మధ్యాహ్నం భారీ వర్షాల కారణంగా నిలిచిపోయిన ముంబై కోల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ నుంచి వెయ్యి మంది ప్రయాణీకులను సురక్షితంగా రక్షించినట్ు సెంట్రల్ రైల్వే ప్రకటించింది. వారిని కల్యాణ్ జంక్షన్‌కు తీసుకొచ్చి స్పెషల్ ట్రైన్లో గమ్యస్థానాలకు పంపారు.

English summary
The IMD predicted heavy to very heavy rains in Mumbai, including extremely heavy rain in isolated places, for Sunday.The Brihanmumbai Municipal Corporation said it was prepared for the monsoon onslaught and asked citizens to be careful.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X