వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల డ్యాన్స్‌కు ఫిదా, పెయింటింగ్స్ చూసి ముగ్ధురాలైన మెలానియా ట్రంప్..

|
Google Oneindia TeluguNews

విద్యార్థులతో మమేకమవడం తనకు అమితా ఆనందాన్ని కలిగించిందని అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ పేర్కొన్నారు. 'నమస్తే అంటూ ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉన్నత పాఠశాల బాగుందని.. తనను పాఠశాలకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం నానక్‌పురలో గల సర్వోదయ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులతో మెలానియా గంటసేపు గడిపారు.

Recommended Video

Melania Trump Planning To Implement Indian Students Skills In USA | Oneindia Telugu

Donald Trump: ఉగ్రవాదంపై ఉక్కుపాదం, భారత్‌తోపాటు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తాం: ట్రంప్Donald Trump: ఉగ్రవాదంపై ఉక్కుపాదం, భారత్‌తోపాటు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తాం: ట్రంప్

విద్యార్థులతోపాటు టీచర్స్‌తో మమేకమయ్యారు. వివిధ అంశాలపై మాట్లాడారు. విద్యార్థులు చేసిన సాంప్రదాయ నృత్యం తనను ఎంతో ఆకట్టుకొందని మెలానియా ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారతదేశానికి తొలిసారి విచ్చేసిన తనకు మీ ఆతిథ్యంతో మురిపించారని మెలానియా తెలిపారు. ఇక్కడ విద్యార్థులతో చూసిన ప్రతిభా పాఠవాలు అమెరికాలోని స్కూళ్లలో అక్కడి విద్యార్థులకు నేర్పే ప్రయత్నం చేస్తానని చెప్పారు.

‘Very inspiring’: Melania Trump after visit to ‘Happiness class’ in Delhi

పాఠశాల దశలో పిల్లలు మత్తు పదార్థాల బారిన పడకుండా చూడాలని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఆన్‌లైన్‌లో చిన్నారుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు లేదంటే చెడుమార్గాన పయనించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. విద్యార్థుల నృత్యం పూర్తయ్యాక తాము వేసిన పెయింటింగ్స్‌ను మెలానియాకు చూపించారు. వాటిని చూసి మెలానియా ముగ్ధురాలయ్యారు. పిల్లలు ప్రకృతితో అనుసంధానం అవడం బాగుందని, మంచి భవిష్యత్ కోసం ఆరోగ్యకరమైన వాతావరణం ఉందన్నారు.

మెలానియా ట్రంప్ పర్యటన కన్నా ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రపంచానికి ఆధ్యాత్మిక నేర్పిన భారత్.. గొప్ప ఉపాధ్యాయులతో విద్యార్థులను తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. 2018 నుంచి హ్యపెనెస్ క్లాస్ అందజేస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ అసాధారణ విజయాలలో ఇది ఒకటి అని కేజ్రీవాల్ గుర్తుచేశారు.

English summary
First Lady of America, Melania, Trump Tuesday visited a Delhi government school in South Delhi to attend a “happiness class.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X