వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌తో దృఢమైన బంధం, ఒక భారతీయుడు మృతి తర్వాత ఆర్మీ చీఫ్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ చైనాతో కలిసి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పొరుగు దేశం నేపాల్. కొత్త మ్యాపు అంటూ సరికొత్త రాగం తీస్తోంది. నిన్న ఓ భారతీయుడిని కాల్చిచంపడంతో ఉద్రిక్తత నెలకొంది. కానీ భారత ఆర్మీ చీఫ్ మాత్రం స్నేహహస్తం అందించారు. నేపాల్‌తో తమ బంధం ధృడమైనదని.. అది కంటిన్యూ అవుతుందని పేర్కొన్నారు. ఒక భారతీయుడు చనిపోయిన తర్వాత కూడా ఆర్మీ చీఫ్ ఎంఎం నారావణే కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకుంది.

Recommended Video

India-Nepal : ఒక భారతీయుడిని కాల్చి చంపిన Nepal పై Army Chief కామెంట్లు Viral

నేపాల్‌తో భౌగోళికంగా, సాంస్కృతికంగా, చారిత్రిక, మతపరంగా ధృడమైన సంబంధం కలిగి ఉంది అని పేర్కొన్నారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లోనూ ఇలానే ఉంటామని భరోసానిచ్చారు. పక్కలో బల్లెంలా తయారైన చైనాతోపాటు నేపాల్ గురించి ఆందోళన వ్యక్తమవుతుంటే ఆర్మీ చీఫ్ కామెంట్లు మాత్రం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

very strong relationship with Nepal: Army Chief

ఇండియా-నేపాల్ సరిహద్దులో గల బీహర్ సీతమర్హి వద్ద శుక్రవారం కాల్పులు జరిగాయి. సోనేబర్ష పోలీసు స్టేషన్ పరిధిలో గల లాల్ బండీ జన్కీ నగర్ సరిహద్దు వద్దకు కొందరు స్థానికులు చేరుకున్నారు. అయితే నేపాల్ పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారని సశస్త్ర సీమబల్ పాట్నా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. సరిహద్దు వరకు స్థానికులు చేరుకోగా.. నేపాల్‌కు చెందిన ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ కాల్పులు జరిపిందని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దు వద్దకు స్థానికులు చేరుకోవడంతో గొడవ మొదలైంది. అయితే నేపాల్ పోలీసులు మాత్రం తమ ఆయుధాలను లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

English summary
very strong relationship with Nepal, says Army Chief after border skirmish leaves one Indian dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X