
ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం..!!
ముంబై: చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ వెటరన్ నటుడు విక్రమ్ గోఖలే కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. విక్రమ్ గోఖలే మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంంతాపం తెలిపారు.
పార్టీకి
వెన్నుదన్నుగా
ఉంటోన్న
ఆ
వర్గానికి
వైఎస్
జగన్
నజరానా
-
కీలక
ప్రకటన
విక్రమ్ గోఖలే పుణేలో నివాసం ఉంటోన్నారు. కొద్దిరోజుల కిందట తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయను వెంటనే దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించారు. మూడు రోజుల కిందట ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించింది. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారాయన. రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సను అందించారు దీనానాథ్ మంగేష్కర్ ఆసుప్రతి డాక్టర్లు.

ఆయన ప్రాణాలను నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేశామని, అత్యాధునిక వైద్యాన్ని అందించామని డాక్టర్లు అన్నారు. వైద్యానికి ఆయన శరీరం స్పందించడం మానేసిందని వివరించారు. ఫలితంగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశామని చెప్పారు. శుక్రవారం నిలకడగా కనిపించినప్పటికీ.. మళ్లీ విషమించిందని డాక్టర్లు పేర్కొన్నారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఆయన భౌతిక కాయానికి ఆదివారం పుణేలో అంత్యక్రియలను నిర్వహించే అవకాశం ఉంది.
1971లో ఆయన బాలీవుడ్లో అడుగుపెట్టారు. అంతకుముందు కొన్ని మరాఠీ సినిమాల్లో నటించారు. మరాఠీ నాటకరంగ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. హమ్ దిల్ దే చుకే సనమ్, భూల్ భులయ్యా, దే ధనా ధన్, హిచ్కీ, మిషన్ మంగళ్, ఛాంపియన్, రంగ్ రసియా, టేక్ ఇట్ ఈజీ, అబ్ తక్ ఛప్పన్ 2, బ్యాంగ్ బ్యాంగ్, మిషన్ 11 జులై వంటి అనేక బాలీవుడ్, మరాఠీ సినిమాలు, నాటకాల్లో నటించారు. గోఖలే మృతి పట్ల మహారాష్ట్ర ముఖ్యంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.