వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా కన్నుమూత

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా ఈరోజు కోల్ కత్తాలోని తన నివాసంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలాకాలంగా మూత్రపిండాలు మరియు గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కోల్ కత్తాలోని న్యూ టౌన్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన మరణం భారతదేశ రాజకీయ వర్గాలలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.

సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా దేశానికి ఆయన చేసిన కృషి తప్పక అందరికీ గుర్తు ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు. గురుదాస్ గుప్తా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సిపిఐ నాయకుడిగా ఉన్న గురుదాస్ గుప్తా 1990 ల నాటినుండి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1985లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ( ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు.

Veteran CPI Leader Gurudas Dasgupta Passed Away

2004లో పశ్చిమబెంగాల్లో పన్స్కురా నుండి 14వ లోక్ సభ కు ఆయన ఎన్నికయ్యారు. ఘటాల్ నియోజకవర్గం నుండి 15వ లోక్ సభకు సైతం ఆయన ఎన్నికయ్యారు. 2జి స్పెక్ట్రమ్ స్కామ్ విషయంలో ఆయన జెపిసి సభ్యుడిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఆరోపణలు గుప్పించారు. టెలికాం లైసెన్సుల పంపిణీ లో జరిగిన అవకతవకల గురించి మన్మోహన్ సింగ్ కు పూర్తిగా తెలుసని ఆయన ఆరోపించారు. మంచి విద్యావంతుడైన పార్లమెంటు సభ్యుడిగా గురుదాస్ గుప్తా మంచి పేరు ప్రతిష్టలు పొందారు.

పార్లమెంట్లో సుదీర్ఘ కాలం కొనసాగిన గురుదాస్ గుప్తా 25 సంవత్సరాల కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఏమైనా అంశాలపైన పార్లమెంట్ వేదికగా చర్చను లేవనెత్తారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు, సాధారణ రాజకీయాల నుండి కాకుండా ఎన్నికల రాజకీయాలు నుండి మాత్రమే పదవి విరమణ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో 70 శాతం పాల్గొన్న గురుదాస్ గుప్తా గత ఎన్నికల్లో పోటీ చేయనని చెప్తూనే తాను కేజీ బేసిన్లో రిలయన్స్ ముఖేష్ అంబానీ చేస్తున్న దోపిడికి వ్యతిరేకంగా చట్టబద్ధంగా రాజకీయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. చివరి వరకు రాజకీయాల్లో తనదైన నిబద్ధతతో పని చేసిన సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా మృతి దేశ రాజకీయ వర్గాలకు తీరనిలోటు. ముఖ్యంగా సీపీఐ పార్టీకి తీరని లోటు .

English summary
Veteran CPI leader Gurudas Dasgupta passed away at his Kolkata residence on Thursday. He was 83 when he breathed his last. He had been suffering from heart and kidney-related ailments for a long time and was admitted to a private hospital in Newtown, Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X