బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్యాక్స్ టెర్రరిజంకు కాఫీ కింగ్ సిద్దార్థ బలి, ఇంత దారుణమా ? గొప్ప వ్యాపారవేత్త, సిద్దూ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త వి.జి. సిద్దార్థ మృతిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. ఓ గొప్ప వ్యాపారవేత్తను కోల్పోయామని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య విషాదం వ్యక్తం చేశారు. ట్యాక్స్ టెర్రరిజయంకు సిద్దార్థ బలి అయ్యారని మాజీ సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.

సిద్దార్థ మృతి చెందారని తెలిసిన వెంటనే తాను షాక్ కు గురైనానని సిద్దరామయ్య ట్వీట్ చేశారు. సిద్దార్థ మృతిపై మాజీ సీఎం సిద్దరామయ్య అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సిద్దార్థ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు వెలుగు చూడాలంటే లోతుగా దర్యాప్తు చెయ్యాలని మాజీ సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు.

సిద్దార్థ మృతికి అసలు కారణాలు వెలుగు చూసినప్పుడే ఆయనకు నిజమైన శ్రద్దాంజలి ఘటించినట్లు అవుతందని సిద్దరామయ్య అన్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వ్యాపారవేత్త సిద్దార్థ ఇలా మృతి చెందుతారని ఎవ్వరూ ఊహించలేదని సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.

మాల్యానా..మజాకా! సిద్ధార్థ ఆత్మహత్యను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడుగా!మాల్యానా..మజాకా! సిద్ధార్థ ఆత్మహత్యను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడుగా!

VG Siddhartha died because of tax terrorism said former CM Siddaramaiah.

కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్దార్థ మృతికి ఐటీ శాఖ అధికారుల వేధింపులే కారణమని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ట్యాక్స్ టెర్రరిజంకు సిద్దార్థ బలి అయ్యారని మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు. సిద్దార్థ చివరిసారి రాసిన లేఖలో ఐటీ శాఖ అధికారుల వేధింపులు వివరాలు ఉన్నాయని సిద్దరామయ్య అన్నారు.

గత ఐదు సంవత్సరాల నుంచి ఐటీ శాఖ అధికారుల వైఖరి అనేక అనుమానాలకు దారితీస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. సిద్దార్థ చావుకు అసలు కారణాలు ఏమిటి ? అనే విషయం వెలుగు చూడాలంటే లోతుగా విచారణ చెయ్యాలని మాజీ సీఎం సిద్దరామయ్య డిమాండ్ చేశారు. జులై 27వ తేదీ సిద్దార్థ తన ఉద్యోగులకు రాసిన లేఖలో ఐటీ శాఖ అధికారుల వేధింపుల గురించి వివరించడంతో ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది.

English summary
Coffee Day VG. Siddhartha died because of tax terrorism said former CM Siddaramaiah. He demands for complete investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X