వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విహెచ్‌పి నేత అశోక్ సింఘాల్‌ ఆరోగ్యం విషమం

|
Google Oneindia TeluguNews

అయోధ్య: విశ్వహిందూ పరిషత్‌ కీలక నేత అశోక్‌ సింఘాల్‌ ఆరోగ్యం మరింత విషమించింది. తీవ్ర అనారోగ్యంతో ఆయన శనివారం గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. పరిస్థితి విషమంగా ఉందనీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారని వీహెచ్‌పీ వర్గాలు వెల్లడించాయి.

89ఏళ్ల సింఘాల్‌ వయసురీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అక్టోబరు 20న ఇదే ఆస్పత్రిలో చేరి మూడ్రోజుల కిందే ఇంటికొచ్చారు.

సింఘాల్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా కొనసాగుతున్నదని మేదాంత ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే దూబే అన్నారు. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో అత్యవసర విభాగంలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

VHP leader Ashok Singhal on life support, condition serious

హిమాచల్‌ సీఎంపై మనీలాండరింగ్‌ కేసు

ఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేటు(ఈడీ) మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. గత సెప్టెంబరులో సింగ్‌పై సీబీఐ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది.

2009-11 మధ్యకాలంలో సింగ్‌ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ.6.1 కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సింగ్‌, అతడి భార్య ప్రతిభాసింగ్‌, ఎల్‌ఐసీ ఏజెంట్‌ ఆనంద్‌చౌహాన్‌, అతడి సోదరుడు సీఎల్‌ చౌహాన్‌ ఉన్నారు.

సింగ్‌ 2009లో జీవితబీమాలో రూ.6.1 కోట్లు మదుపు చేశారని, ఈ డబ్బంతా వ్యవసాయం నుంచి వచ్చినట్లు సింగ్‌ చెప్పారని సీబీఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని చట్టబద్ధం చేసేందుకు 2012లో ఆయన ప్రయత్నించారని వెల్లడించింది.

English summary
Vishwa Hindu Parishad (VHP) leader Ashok Singhal who was admitted to the Medanta Hospital here has been put on life support system and his condition is serious.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X