• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఒకేరోజు 70 క్యాన్ల కోక్.. వయాగ్రా.. డెలివరీ బాయ్ ఆసక్తికర విషయాలు

|

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా టైమ్ నడుస్తోంది. ఏ దేశం చూసినా.. ఎక్కడ చూసినా కరోతనా గురించే చర్చ. ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని ఇళ్లకే పరిమితమయ్యేలా చేసింది. ఇప్పటికీ వ్యాక్సిన్ కనుగొనని ఈ వైరస్ నియంత్రణ కోసం చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అదే సమయంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ చాలాచోట్ల యథావిధిగా తమ విధులను నిర్వహిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు,ఫుడ్,మెడిసిన్ వంటివి డెలివరీ చేయడానికి ప్రభుత్వాలు కొన్ని ఈకామర్స్ సంస్థలకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభ సమయంలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి సంబంధించిన ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.

డబ్బు కోసమే.. ఎవరా డెలివరీ బాయ్

డబ్బు కోసమే.. ఎవరా డెలివరీ బాయ్

బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో ఎరిక్ థియాగో అనే యువకుడు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ప్రపంచమంతా కరోనా వైరస్ భయానికి ఇళ్లకే పరిమితమైతే.. ఎరిక్ మాత్రం కనీసం ముఖానికి మాస్కు కూడా ధరించకుండా నిత్యావసరాలు డెలివరీ చేస్తున్నాడు. తన వెంట కేవలం ఒక చిన్న శానిటైజర్ బాటిల్‌ను మాత్రమే పెట్టుకుంటున్నాడు. ప్రతీ డెలివరీ తర్వాత చేతులను శానిటైజర్‌తో వాష్ చేసుకుంటున్నాడు. పేద కుటుంబానికి చెందిన ఎరిక్.. ఒకవేళ కరోనా మరింత విజృంభించి పరిస్థితులు మరింతగా దిగజారితే.. ఎంతో కొంత డబ్బు చేతిలో ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్టు చెబుతున్నాడు.

70 కోక్ క్యాన్లు.. వయాగ్రా..

70 కోక్ క్యాన్లు.. వయాగ్రా..

రప్పీ అనే ఆన్‌లైన్ ఈకామర్స్ సంస్థలో ఎరిక్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. సాధారణ రోజుల్లో ఆర్డర్స్ బాగుంటే ఎంతలేదన్నా 100 రియల్స్(బ్రెజిల్ కరెన్సీ) సంపాదించేవాడు. అది 20డాలర్ల మొత్తానికి సమానం. కానీ ప్రస్తుతం డిమాండ్ పడిపోవడంతో గురువారం(మార్చి 26)న కేవలం 31రియల్స్ మాత్రమే సంపాదించాడు. డెలివరీలో భాగంగా ఓ వ్యక్తికి 70 క్యాన్ల కోక్ డెలివరీ చేసినట్టు తెలిపాడు. అంతేకాదు,ఇలాంటి సమయంలో వయాగ్రా లాంటి ఆర్డర్స్ కూడా వస్తున్నాయని.. 70 క్యాన్ల కోక్ సప్లై చేసిన రోజే మరో కస్టమర్‌కు వయాగ్రా డెలివరీ చేశానని తెలిపాడు. సూపర్‌మార్కెట్ నుంచి కేవలం 30మీటర్ల దూరంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కూడా ఆన్‌లైన్‌లో గ్రాసరీ కొనుగోలు చేస్తే డెలివరీ చేసినట్టు తెలిపాడు.

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
  దాదాపు 2లక్షల మంది డెలివరీ బాయ్స్..

  దాదాపు 2లక్షల మంది డెలివరీ బాయ్స్..

  బ్రసీలియా జనాభా దాదాపు 1.2కోట్లు. థియాగో బ్రసీలియా శివారులోని ఫవేలా అనే మురికివాడలో నివసిస్తుంటాడు. డెలివరీ బాయ్‌గా పనిచేసేందుకు ప్రతీరోజూ శివారు ప్రాంతం నుంచి గంట సేపు ప్రయాణించి నగరానికి చేరుకుంటాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి కొనిచ్చిన బైక్‌పై తిరుగుతూ నిత్యావసరాలు డెలివరీ చేస్తుంటాడు. గతంలో తాను ఫాస్ట్ ఫుడ్ డెలివరీ చేసేవాడినని.. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో తననను నిత్యావసరాల డెలివరీ సెక్షన్‌కు మార్చారని చెప్పాడు. థియాగో పనిచేసే ఈకామర్స్ సంస్థలో లాటిన్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేస్తుండటం గమనార్హం.

  English summary
  As others in this city of 12 million stay home to slow the coronavirus outbreak, the 22-year-old rides an hour from his favela in the southern outskirts to deliver groceries, medicine and whatever else residents of upscale neighborhoods request.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more