వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు: అంబానీ, మోడీని ఆకాశానికెత్తిన బిర్లా(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని నరంద్రమోడీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంక్ సుప్రీమో జిమ్ యాంగ్ కిమ్ హాజరయ్యారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

వీరితో పాటు దేశ, అంతర్జాతీయ టాప్ 50 సంస్ధల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా హాజరయ్యారు.

గుజరాత్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు: ముకేశ్ అంబానీ

ఉజ్వల గుజరాత్ సదస్సులో రిలయనస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ఉజ్వల గుజరాత్ సదస్సు ప్రతి ఏటా విజయవంతమవుతోందని, సదస్సులో పాల్గొనటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మేన్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఈ కార్యక్రమానికి మరింత బలం చేయాకూర్చాయన్నారు.

ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గుజరాత్‌లో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని ముకేశ్ అంబానీ స్పష్టం చేశారు. ప్యూచర్ ఓరియంటెడ్ స్టేట్‌గా గుజరాత్ అవతరిస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో వ్యాపారానికి ఎన్నో అవకాశాలున్నాయని... ఆ అవకాశాల్ని సద్వినియోగపర్చుకోవాలని పేరుగాంచిన సంస్ధలకు ముకేశ్ పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ ఒక విజన్ గల నేత: కుమార మంగళం బిర్లా

ఉజ్వల గుజరాత్‌లో పాల్గొన్న ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తారు. ప్రధాని మోడీ ఒక విజన్ కలిగిన నేతగా కొనియాడారు. ప్రపంచ చిత్ర పటంలో భారత్‌ను ఉజ్వల స్ధాయికి తీసుకెళ్లడానికి మోడీ విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో భారతు ముందుకెళుతుందని చెప్పారు.

వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన పాలనే మోడీ ఆయుధంగా కీర్తించారు. స్పష్టమైన విధానాలు, హై స్పీడ్ కార్యనిర్వహణను మనం గుజరాత్‌లో చూడొచ్చని తెలిపారు. తమ సంస్ధ పెట్టుబడులకు గుజరాత్ అత్యంత కీలకమైన రాష్ట్రమని అన్నారు.

భారత్ అభివృద్ధికి సహకరిస్తాం: ప్రపంచ బ్యాంకు ఛైర్మన్ జిమ్ యాంగ్ కిమ్

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో జిమ్ యాంగ్ కిమ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది భారత్ 6.5 వృద్ధి రేటుని సాధిస్తుందని అంచనా వేసినట్లు చెప్పారు. ప్రపంచ ఆర్ధిక వ్వవస్ధలో భారత్ ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు.

జీఎస్‌టీ అమలుకు ఆర్డినెన్స్ తేవడాన్ని ప్రశంసిస్తున్నట్లు వెల్లడించారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ అగ్రస్ధానంలో నిలస్తుందని పేర్కొన్నారు.

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు ప్రధాని నరంద్రమోడీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంక్ సుప్రీమో జిమ్ యాంగ్ కిమ్ హాజరయ్యారు.

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

వీరితో పాటు దేశ, అంతర్జాతీయ టాప్ 50 సంస్ధల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా హాజరయ్యారు.

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

ఉజ్వల గుజరాత్‌లో పాల్గొన్న ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తారు. ప్రధాని మోడీ ఒక విజన్ కలిగిన నేతగా కొనియాడారు. ప్రపంచ చిత్ర పటంలో భారత్‌ను ఉజ్వల స్ధాయికి తీసుకెళ్లడానికి మోడీ విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో భారతు ముందుకెళుతుందని చెప్పారు.

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు

గాంధీనగర్‌లో ప్రారంభమైన 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు
వీరితో పాటు దేశ, అంతర్జాతీయ టాప్ 50 సంస్ధల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉజ్వల గుజరాత్ తరహాలోనే చాలా రాష్ర్టాలు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. 2011, 2013లో జరిగిన సదస్సు పెట్టుబడి దారుల్లో విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.

English summary
Within an hour of the start of the Vibrant Gujarat Business Summit, three major industrialists had pledged investment of over Rs. 1,20,000 crore in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X