వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ను తయారీ హబ్‌గా: మోడీ... మోడీకి బాసటగా నిలుస్తాం: జాన్‌కెర్రీ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడారు. 2030 నాటిటి భారత్ ఐదో అతిపెద్ద ఎగుమతుల దేశంగా అవతరిస్తుందని మోడీ పేర్కొన్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

తమ ప్రభుత్వం కేవలం హామీలు, విధానాలు ప్రకటించడమే కాకుండా చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తోందన్నారు. ప్రధాన మంత్రి యోజన ద్వారా 100 రోజుల్లోనే 10 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు తెలిపారు. ప్రపచంమంతా వసుధైక కుటుంబం అని భారత్ విశ్వసిస్తోందన్నారు.

ప్రపంచామంతా సుఖంగా ఉండాలన్నదే తమ తుది లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడెకెళ్లినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గుబాళిస్తున్నాయన్నారు. యోగా మానవ జీవిత విధానాన్ని మారుస్తుందని, అలాంటి దానికి గుర్తింపు ఇచ్చినందుకు ఐక్యరాజ్యసమితికి మోడీ ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌ను తయారీ హబ్‌గా తీర్చిదిద్దుదాం: ప్రధాని మోడీ

భారత్‌లో ప్రపంచ స్ధాయిలో స్మార్ట్ సిటీల అభివృద్ధిని చేపడతామని ప్రధాని మోడీ అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందే దేశంగా ఐఎంఎఫ్ అంచనా వేసిందని చెప్పారు. భారతీ తయారీ రంగం హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

సాగరమాల పేరుతో ఓడరేవుల నిర్మాణం, రహదారులతో అనుసంధానం చేస్తామని చెప్పారు. పరిశ్రమలకు అనుమతుల కోసం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉజ్వల గుజరాత్ తరహాలోనే చాలా రాష్ర్టాలు ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. 2011, 2013లో జరిగిన సదస్సు పెట్టుబడి దారుల్లో విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు.

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రవాద దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఈ సదస్సులో వందకు పైగా దేశాలు పాల్గొన్నాయని పేర్కొన్నారు.

మోడీ, ఒబామా దూరదృష్టిగల నేతలు: జాన్‌కెర్రీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో జాన్ కెర్రీ పాల్గొని ప్రసంగించారు. సాధారణ పౌరుడు కూడా ప్రధాని కాగలడని బారత్ నిరూపించిందని అమెరికా విదేశాంక మంత్రి జాన్ కెర్రీ అభిప్రాయపడ్డారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకే రకమైన దూరదృష్టి గల నేతలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ వ్యాఖ్యానించారు. సమష్టి కృషి వల్లే సమష్టి అభివృద్ధి అని మోడీ చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.

వాతావరణ మార్పులకు పర్యావరణరహిత ఇంధన విధానమే సమాధానమని జాన్ కెర్రీ అన్నారు. భారతదేశ గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఎంతో ఉత్సుకతతో ఉన్నారని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలన్న మోడీ లక్ష్యానికి బాసటగా నిలుస్తామని తెలిపారు.

గాంధీ సిద్ధాంతాలు స్పూర్తిదాయకం: బాన్‌ కీ మూన్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన స్మార్ట్‌సిటీల నిర్మాణ ప్రతిపాదన ప్రశంసనీయమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి జాన్‌కీ మూన్ అన్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతోన్న ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో మాట్లాడారు.

ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిలో గుజరాత్ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి దిశగా భారత పారిశ్రామికవేత్తలు పనిచేయాలని సూచించారు.

అంతక ముందు ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ బాన్‌ కీ మూన్‌ అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత జాతిపిత మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్ముని ఆశయాలు నిత్యం ఆచరణీయమని ఆయన పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు.

ఈ సదస్సుకు ప్రధాని నరంద్రమోడీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంక్ సుప్రీమో జిమ్ యాంగ్ కిమ్ హాజరయ్యారు. వీరితో పాటు దేశ, అంతర్జాతీయ టాప్ 50 సంస్ధల సీఈఓలు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్‌కు చెందిన పారిశ్రామిక వేత్తలతో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ, బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా హాజరయ్యారు.

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధాని మోడీ మాట్లాడారు. 2030 నాటిటి భారత్ ఐదో అతిపెద్ద ఎగుమతుల దేశంగా అవతరిస్తుందని మోడీ పేర్కొన్నారు.

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో జాన్ కెర్రీ పాల్గొని ప్రసంగించారు. సాధారణ పౌరుడు కూడా ప్రధాని కాగలడని బారత్ నిరూపించిందని అమెరికా విదేశాంక మంత్రి జాన్ కెర్రీ అభిప్రాయపడ్డారు.

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒకే రకమైన దూరదృష్టి గల నేతలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్‌కెర్రీ వ్యాఖ్యానించారు. సమష్టి కృషి వల్లే సమష్టి అభివృద్ధి అని మోడీ చెప్పిన మాటలు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన ఉజ్వల గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో జాన్ కెర్రీ పాల్గొని ప్రసంగించారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్‌ను అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి పరిచయం చేస్తున్న ప్రధాని మోడీ.

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

'ఉజ్వల గుజరాత్' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోడీ

వాతావరణ మార్పులకు పర్యావరణరహిత ఇంధన విధానమే సమాధానమని జాన్ కెర్రీ అన్నారు. భారతదేశ గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనేందుకు తమ అధ్యక్షుడు ఒబామా ఎంతో ఉత్సుకతతో ఉన్నారని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం ఐదు రెట్లు పెరగాలన్న మోడీ లక్ష్యానికి బాసటగా నిలుస్తామని తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi is addressing the 7th edition of Vibrant Gujarat Summit, a flagship programme of Gujarat government, in Gandhinagar which is also seeing the participation of UN Secretary General Ban Ki-Moon and US Secretary of State John Kerry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X