వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ పాలిటిక్స్‌లో బ్లాక్‌బస్టర్: చేతులు కలపనున్న రజినీకాంత్ కమల్ హాసన్..?

|
Google Oneindia TeluguNews

చెన్నై: దక్షిణ భారతంలో రాజకీయాల విషయానికొస్తే ఎప్పటికీ రెండు రాష్ట్రాల పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాగా మరొకటి తమిళనాడు రాజకీయాలు. ఈ ఆసక్తి ఇప్పటి నుంచి కాదు.. కొన్ని దశాబ్దాలుగా ప్రజల్లో నెలకొంది. ఏపీ, తమిళనాడు రాజకీయాలు రెండు ఒకే పంథాలో ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఏపీ రాజకీయాలు పక్కన ఉంచితే తమిళరాజకీయాలు అమ్మ జయలలిత అకాల మరణంతో మారాయి. ఇక అమ్మ మృతి తర్వాత ఇద్దరు సూపర్‌స్టార్లు కొత్త పార్టీలు పెట్టారు. అందులో ఒకరు కమల్‌హాసన్ కాగా మరొకరు రజినీకాంత్. అయితే వీరిద్దరూ తమిళనాడులో కలిస్తే ఇంకేముంది అక్కడ పొలిటికల్ బ్లాక్‌బస్టర్ ఇస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

 రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్‌తో కీలక భేటీ, ఇక ముందుకే రజినీకాంత్ ఎంట్రీ త్వరలోనే!: ప్రశాంత్ కిషోర్‌తో కీలక భేటీ, ఇక ముందుకే

40 ఏళ్ల స్నేహం రాజకీయ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందా..?

40 ఏళ్ల స్నేహం రాజకీయ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందా..?

ఒకరు సూపర్‌స్టార్ రజినీకాంత్.. మరొకరు యూనివర్శల్ స్టార్ కమలహాసన్. ఇద్దరి స్నేహం 1975లో అంటే 40 ఏళ్ల క్రితం విడుదలైన అపూర్వరాగంగళ్ చిత్రంతో మొదలైంది. ఇప్పుడు ఇద్దరూ తమిళ ఇండస్ట్రీలోనే కాదు ఇటు భారతదేశం మొత్తం మీద అతి పెద్ద స్టార్స్‌గా ఎదిగారు. ఇక వీరిద్దరూ సొంతపార్టీలను పెట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఇద్దరూ ఒకటవుతున్నట్లుగా చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇద్దరూ కలిసి ఒకేవేదికపైకి వస్తే తమిళనాడులో పొలిటికల్ బ్లాక్‌బస్టర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

రజినీతో కలిసి నడిచేందుకు ఓకే చెప్పిన భారతీయుడు

రజినీతో కలిసి నడిచేందుకు ఓకే చెప్పిన భారతీయుడు


రజినీకాంత్‌తో కలిసి నడుస్తారా అని కమల్‌హాసన్‌ను అడుగగా.. తప్పేముంది అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు రజినీతో చేతులు కలపడం ఒక అద్భుతమైన విషయమనీ తాను భావించట్లేదని చెప్పారు. ఈ మాటలు చెప్పి తాను రాజకీయంగా రజినీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధంగానే ఉన్నట్లు పరోక్షంగా చెప్పారు భారతీయుడు. గత 44 ఏళ్లుగా తాము కలిసే ఉన్నామని తమ స్నేహం ఆనాటిదని చెప్పుకొచ్చిన కమల్... అవసరమైతే రాజకీయాల్లో కూడా కలిసే పనిచేస్తామని వెల్లడించారు. తమిళ ప్రజల మేలు కోసం వారికి మంచి చేసేందుకు ఇద్దరం కలిసే పయనిస్తామని చెప్పుకొచ్చారు.

తమిళుల మేలు కోసం కలిసి నడవటంలో తప్పులేదు

తమిళుల మేలు కోసం కలిసి నడవటంలో తప్పులేదు

కమల్‌హాసన్ ప్రకటన చేసిన అరగంటకే తలైవా రజినీకాంత్ కూడా ఓ ప్రకటన చేశారు. తమిళనాడు ప్రజల మేలు కోసం కలవాల్సి వస్తే తాను కమల్‌హాసన్‌తో కలిసి రాజకీయంగా నడిచేందుకు సిద్ధమన్నారు రజినీకాంత్. ఇద్దరం కచ్చితంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇక ఈ ప్రకటనతో ఇటు కమల్ అభిమానులు అటు రజినీ అభిమానుల్లో ఆనందం వ్యక్తమైంది. కమల్ హాసన్ రజినీకాంత్‌లు చేతులు కలిపి ఒకే రాజకీయవేదికను పంచుకుంటే అంతకంటే మంచి ఏముంటుందని అన్నారు మక్కల్ నీది మయం పార్టీ సభ్యులు అరుణాచలం. ఇక వీరిద్దరు కలుస్తారనే వార్త తన 50 ఏళ్ల జీవితంలో వింటున్న అతి మంచి శుభవార్త అని అరుణాచలం చెప్పారు. కమల్-రజినీ కలిస్తే తమిళనాడు రాష్ట్రం సుఖసౌభాగ్యాలతో వర్థిల్లుతుందని చెప్పారు.

ఫ్యాన్స్‌కు పండగే..తమిళనాడు మారబోతోంది

ఫ్యాన్స్‌కు పండగే..తమిళనాడు మారబోతోంది

రజినీకాంత్, కమల్‌హాసన్‌లు వెండితెరమీద కలిసి కనిపిస్తేనే తమిళనాడు ప్రజలకు పండగ అవుతుందని అలాంటప్పుడు ప్రజల మంచి కోసం ఇద్దరూ కలిస్తే ఇక అంతకంటే భాగ్యమేముంటుందని అన్నారు రజినీకాంత్ పంచతంత్ర, గ్రాండ్ బ్రాండ్ రజినీ పుస్తక రచయిత పీసీ బాలసుబ్రహ్మణ్యం.ఇక ఒకవేళ రాజకీయంగా కమల్ భావజాలం, రజినీ భావజాలం వేరుగా ఉన్నప్పటికీ ఇద్దరూ కలిస్తే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో గట్టిపోటీ ఇవ్వగలరని తాను భావిస్తున్నట్లు చెప్పారు పీసీ బాలసుబ్రహ్మణ్యం. ఇదిలా ఉంటే ఇద్దరు సూపర్‌స్టార్‌లు కలిసి రాజకీయాల్లో నడిస్తే అవినీతి కూపంలో చిక్కుకుపోయిన తమిళనాడును కాపాడగలుగుతారని చెప్పారు మక్కల్ నీది మయం ఉపాధ్యక్షులు ఆర్ మహేంద్రన్.

 ఇద్దరు కలిసినా ఇబ్బందేమీ లేదు: అన్నాడీఎంకే

ఇద్దరు కలిసినా ఇబ్బందేమీ లేదు: అన్నాడీఎంకే

కమల్ హాసన్ - రజినీకాంత్ ఇద్దరూ కలవడంపై హింట్ ఇచ్చిన నేపథ్యంలో ఇతర రాజకీయపార్టీలకు చెందిన నాయకులు వెంటనే స్పందించారు. వారిద్దరు కలవడం వల్ల తమకు వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డీ జయకుమార్. వారిద్దరూ కలిసి వచ్చినా తాము పట్టించుకునే స్థితిలో లేమని చెప్పారు. తమ పార్టీ ఒక శిఖరం లాంటిదని దాన్ని తాకడం ఎవరి తరం కాదని అన్నారు మంత్రి జయకుమార్. డీఎంకేపైనే తమ దృష్టి అని స్పష్టం చేశారు. అన్నాడీఎంకేకు బలమైన ఓటుబ్యాంకు ఉందన్న జయకుమార్ డీఎంకేనే నష్టపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ వెర్షన్ కూడా ఇదేలా ఉంది.

 ఇద్దరి సిద్ధాంతాలు వేరు.. కలుస్తారనుకోము: బీజేపీ

ఇద్దరి సిద్ధాంతాలు వేరు.. కలుస్తారనుకోము: బీజేపీ

కమల్ హాసన్ రజినీకాంత్ ఇద్దరూ కలిసినా తమకేమీ ఇబ్బంది లేదన్నారు బీజేపీ నేత నారాయణన్ తిరుపతి. ఇద్దరి భావజాలాలు వేరని చెప్పిన నారాయణన్... కమల్ హాసన్ నాస్తికత్వంతో ఉన్న వ్యక్తి అని రజినీ కాంత్ ఆధ్మాత్మికతతో ఉండే వ్యక్తి అని ఇద్దరూ రాజకీయంగా కలవడం అనేది సాధ్యపడుతుందా అని ప్రశ్నించారు. ఇద్దరూ కలవడంలో తప్పేమీ లేదని చెప్పారు ఒకవేళ కలిసినా పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని తమపని తాము చేసుకుపోతామని వెల్లడించారు నారాయణన్ తిరుపతి.

Recommended Video

Kamal Haasan Warned Over The Imposition Of Hindi On The Nation| కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించిన కమల్
రజినీ రీల్ హీరో రియల్ హీరో కాదన్న సీఎం పళనిస్వామి

రజినీ రీల్ హీరో రియల్ హీరో కాదన్న సీఎం పళనిస్వామి

బీజేపీలో రజినీకాంత్ చేరుతారని వస్తున్న వార్తలను స్వయంగా భాషానే ఖండించారు. తనకు కాషాయ రంగు అంటించేందుకు చాలామంది ప్రయత్నించారని కానీ అది వారివల్ల కాదని చెబుతూ వార్తలకు చెక్ పెట్టారు. డిసెంబర్ 31,2017లో తాను పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన తలైవా.. ఆ సమయంలో తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ పోటీచేస్తుందని క్లారిటీ ఇచ్చారు. అయితే పార్టీని ఇప్పటి వరకు అధికారికంగా పెట్టకపోవడంపై పలు విమర్శలు సైతం రజినీ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన కేవలం రీల్ హీరో అని రియల్ హీరో కాదని తమిళనాడు సీఎం పళనిస్వామి ఓ సందర్భంలో కామెంట్ చేశారు.

మొత్తానికి ఇద్దరు తమిళ సూపర్‌స్టార్‌లు చేతులు కలపడం ఒక్క తమిళనాడులోనే కాదు దక్షిణభారత రాజకీయాల్లో ఓ పెద్ద డెవలప్‌మెంట్‌గా చూస్తున్నారు విశ్లేషకులు. అయితే వీరిద్దరూ పొలిటికల్ బ్లాక్‌బస్టర్ ఇస్తారా లేదా అనేది మాత్రం తెలియాలంటే మరికొంతకాలం వేచిచూడాల్సిందే.

English summary
Rajinikanth and Kamal Haasan. Superstar and Ulaganayagan. A friendship forged on the sets of Apoorva Raagangal (1975) has lasted four decades, and now, Kollywood's two biggest stars have hinted at a joint political venture
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X