తదుపరి నేవీ ఛీఫ్‌గా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్
తదుపరి నేవీ ఛీఫ్‌గా కరంబీర్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక మే 31 2019తో ప్రస్తుత నేవీ ఛీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం వైస్ అడ్మైరల్ సింగ్ వైస్ ఛీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో కరంబీర్ సింగ్ పూర్వ విద్యార్థి.
Government appoints Vice Admiral Karambir Singh, PVSM, AVSM, FOC in C Eastern Naval Command as the next Chief of Naval Staff vice Admiral Sunil Lanba,PVSM, AVSM, ADC, who vacates the office on 31 May 2019. pic.twitter.com/g5cKJb7KQm
— Defence Spokesperson (@SpokespersonMoD) March 23, 2019
ఇక భారత వాయుసేనలోకి కరంబీర్‌సింగ్ జూలై 1980లో చేరారు. హెలికాఫ్టర్ పైలట్‌గా 1982లో ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని తూర్పు నేవల్ కమాండ్‌లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్‌గా వైస్ అడ్మిరల్ సింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.