వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలా చేస్తే ఇండియా పరువుపోతుంది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆందోళన

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సరవణ, ఎన్ఆర్సీ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో హింస, విధ్వంసం చోటుచేసుకోవడం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని, అయితే విధ్వంసకర రీతిలో నిరసనల్ని మాత్రం ఎవరూ సహించబోరని చెప్పారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.

దేశానికి చెడ్డపేరు..
అహింసే భారతదేశానికి అస్థిత్వంగా ఉందని, ప్రజలు శాంతియుతంగా తమ నిరసన, వ్యతిరేకత తెలియపర్చాలేగానీ, వినాశకర పద్ధతులవైపు మళ్లడం వల్ల దేశానికి చెడ్డపేరొస్తుందని వెంకయ్య చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లా తలపడాలేగానీ శత్రువుల్లా కొట్టుకోవద్దని, వ్యక్తిగత దూషణలతో ప్జలకు తప్పుడు సంకేతాలు వెళతాయని, రాజకీయ చర్చలు ఎప్పుడైనా హుందాగా ఉండాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

Vice President Venkaiah Naidu Comments On CAA, NRC protest
English summary
Protests in destructive manner are not acceptable says Vice President M Venkaiah Naidu On CAA, NRC agitation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X