వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య నాయుడుకు కరోనా - ఐసోలేషన్‌లోకి ఉపరాష్ట్రపతి

|
Google Oneindia TeluguNews

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును సైతం కరోనా మహమ్మారి తాకింది. స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వెంకయ్య కార్యాలయం మంగళవారం వెల్లడించారు.

ఎలాంటి లక్షణాలు లేకుండానే తానకు కరోనా వైరస్‌ పాజిటివ్ గా తేలిందని, డాక్టర్ల సూచన మేరకు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని వెంకయ్య తెలిపారు. కాగా, వెంకయ్య భార్య ఉషా నాయుడుకు కూడా కరోనా వైరస్ పరీక్ష జరుపగా నెగటివ్‌గా తేలిందని వైస్‌ ప్రెసిడెంట్‌ సెక్రటేరియట్‌ ట్విట్టర్‌లో తెలిపింది.

Vice President Venkaiah Naidu tests positive for COVID-19

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ బారినపడ్డారు. అసాధారణ రీతిలో ఏర్పాట్లు చేసినప్పటికీ, ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 30 మందికిపైగా ఎంపీలు, 50మందివరకు సిబ్బందికి వైరస్ సోకడంతో సమావేశాలను అర్థాంతరంగా నిలిపేసి, ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయడం తెలిసిందే.

Recommended Video

SP Charan Clarity On SP Balasubrahmanyam Hospital Bill | Oneindia Telugu

కరోనా కారణంగా ఇప్పటికే కేంద్ర మంత్రి సురేశ్ అంగడి, కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్, తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. వివిధ రాష్ట్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మహమ్మారి కాటుకు బలయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 70,589 కేసులు, 776 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి వరకు దేశంలో కేసుల సంఖ్య 62 లక్షలకు, మరణాలు 97వేలకు చేరువయ్యాయి.

English summary
The Vice President of India, Venkaiah Naidu, tested positive for the novel coronavirus on Tuesday. Naidu underwent a routine COVID-19 test on Tuesday morning and was found to be COVID-19 positive. His official twitter handle reported the news, saying he is asymptomatic and in good health. It added: "He has been advised home quarantine. His wife Smt. Usha Naidu has been tested negative and is in self-isolation."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X