వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గన్‌తో భయపెట్టి ఇంజనీర్ బలవంతపు పెళ్లి.. చెల్లదని తేల్చిచెప్పిన బీహార్ ఫ్యామిలీ కోర్టు..

|
Google Oneindia TeluguNews

పాట్నా : బీహర్‌ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది గూండాయిజం. ఈ మధ్యకాలంలో కాస్త తగ్గినా అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అక్కడి పరిస్థితిని చెప్పకనే చెబుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఓ ఇంజనీర్ పెళ్లి అందుకు ఓ నిదర్శనం. గవర్నమెంంట్ ఉద్యోగి అయిన యువకున్ని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో హాల్ చల్ చేసింది. గన్‌తో బెదిరించి పెళ్లి తంతు పూర్తి చేయడంపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే బలవంతపు పెళ్లి నాకొద్దంటూ ఆ యువకుడు చేసిన పోరాటానికి తాజాగా ఫలితం దక్కింది. ఆ వివాహం చెల్లదని బీహార్‌లోని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది.

'

 ఇంజనీర్‌‌ను కిడ్నాప్ చేసిన దుండగులు

ఇంజనీర్‌‌ను కిడ్నాప్ చేసిన దుండగులు

బొకారో స్టీల్ ఫ్లాంటులో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న వినోద్ అనే యువకుడు 2017 డిసెంబర్‌లో తన ఫ్రెండ్ పెళ్లికి బయలుదేరాడు. బస్సు కోసం ఎదురుచూస్తుండగా సురేందర్ యాదవ్ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు. దీంతో కారు ఎక్కిన వినోద్‌ను వారు కిడ్నాప్ చేశారు. నేరుగా తమ ఇంటికి తీసుకెళ్లి తన చెల్లెలిని పెళ్లి చేసుకొమ్మని బెదిరించాడు. అందుకు నిరాకరించిన వినోద్‌ను అమ్మాయి తరఫు బంధువులు తీవ్రంగా కొట్టారు. అయినా వినోద్ పెళ్లికి ససేమిరా అనడంతో సురేందర్ గన్‌తో బెదిరించాడు.

బలవంతంగా పెళ్లి చేసిన వధువు బంధువులు

బలవంతంగా పెళ్లి చేసిన వధువు బంధువులు

ప్రాణాలు రక్షించుకునేందుకు వినోద్ బలవంతపు వివాహం చేసుకున్నాడు. బీహార్‌లో పకాడ్వా వివాహ్‌గా వ్యవహరించే ఈ పెళ్లి తంతు జరిగినంత సేపు వరుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేయడంపై వినోద్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే స్థానిక పోలీసులు వధువు తరఫువారి పలుకుబడి కారణంగా ఈ విషయాన్ని తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. విషయం కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదుచేశారు.

కోర్టును ఆశ్రయించిన బాధితుడు

కోర్టును ఆశ్రయించిన బాధితుడు

వధువు తరఫు వారిపై క్రిమినల్ కేసు నమోదైన అనంతరం వినోద్ కోర్టును ఆశ్రయించాడు. బలవంతంగా చేసిన పెళ్లిని రద్దు చేయాలంటూ ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వినోద్‌కు అనుకూలంగా తీర్పు చెప్పింది. గన్‌తో బెదిరించి బలవంతపు పెళ్లి చెల్లదని తేల్చి చెప్పింది. దీనిపై వధువు తరఫు వారు పైకోర్టులో అప్పీలుకు వెళ్లినా దానికి వ్యతిరేకంగా పోరాడతానని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

 బీహార్‌లో సర్వసాధారణం

బీహార్‌లో సర్వసాధారణం

నిజానికి బీహార్‌లో ఇలాంటి ఇలాంటి పెళ్లిళ్లు సర్వ సాధారణం. అబ్బాయిల్ని బలవంతంగా ఎత్తుకొచ్చి తమ ఆడపిల్లలతో పెళ్లిళ్లు చేయడం సంప్రదాయంగా భావిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితిలో మార్పు వచ్చింది. కొంతకాలంగా చట్టాలను కఠినంగా అమలు చేస్తుండటంతో పకాడ్వా వివాహాలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

English summary
An engineer who was kidnapped and forced to marry a woman at a gunpoint in Bihar gets a major relief from the family court in Patna. His wedding has been annulled by the court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X