వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళపై ఇటుకతో దాడి చేస్తూ చిక్కిన హెడ్‌కానిస్టేబుల్ (వీడియో)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఓ మహిళ పైన ఇటుకతో దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ దారుణం సోమవారం నాడు జరిగింది. అతను ఇటుక రాయితో ఓ మహిళపై దాడి చేశాడు. ఆ మహిళ సిగ్నల్‌ క్రాస్‌ చేయడంతో అడ్డుకున్న కానిస్టేబుల్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు.

అందుకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో అతను ఇటుక రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది నడి రోడ్డు పైన జరిగింది. దీంతో అతనిని సస్పెండ్ చేశారు.

ఈ వీడియో హల్ చల్ చేస్తుండటంతో.. దీనిని గుర్తించిన అధికారులు అతనిని సస్పెండ్ చేయడమే కాకుండా, అతని పైన క్రిమినల్ కేసును నమోదు చేశారు.

దాడి సమయంలో బాధిత మహిళ ద్విచక్ర వాహనం పైన వెళ్తోంది. ఆ సమయంలో అతను ఫైన్ అంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. తనతో పాటు తన చిన్నారిని కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ వేధించాడని ఆ మహిళ పిర్యాదు చేసింది. తమ మధ్య వాదన జరుగుతున్న సమయంలో అతను ఇటుకరాయి తీసుకొని దాడి చేశాడని చెప్పింది.

Video: Delhi Police constable, who threw brick, assaulted woman, arrested

చింతిస్తున్నాం: బస్సీ

ఈ ఘటన పైన ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ స్పందించారు. ఢిల్లీ పోలీసుల తరఫున తాను దీనిపై పశ్చాత్తాపం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సదరు హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని చెప్పారు. అతని పైన కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయాలని ఆదేశించానని తెలిపారు.

సదరు వీడియోలో... ఆ మహిళ ఆ ఇటుకను తీసుకొని కింద పడేసినట్లుగా ఉంది. దీనిపై స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీసు (ట్రాఫిక్) ముక్తేష్ చందర్ మాట్లాడుతూ... సదరు హెడ్ కానిస్టేబుల్ పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, దీనికి తామంతా చింతిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో తన టూవీలర్ డామేజ్ అయిందని బాధిత మహిళ చెప్పారు.

కాగా ఈ వీడియోను కమల్ కాంత్ అనే వ్యక్తి తీశారని తెలుస్తోంది. అతను మాట్లాడుతూ.. తనను కానిస్టేబుల్ రూ.200 అడిగాడని సదరు బాధిత మహిళ చెప్పిందని, తాను రెడ్ లైట్‌ను క్రాస్ చేశానని అడిగాడని చెప్పిందని అతను తెలిపారు. ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర సంఘటన పైన మాట్లాడుతూ.. ఈ అంశంపై దృష్టి పెడతామని చెప్పారు.

English summary
Head Police Constable Satish Chand, who initially was suspended, has been arrested now. Latest action against the police constable has been taken when the victim reached police station and filed legal complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X