వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: పెళ్లి కాల్పుల్లో వరుడి తండ్రి మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

ఇండోర్: ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి సంబరాల్లో భాగంగా కొందరు గాల్లోకి కాల్పులు జరిపారు. అందులో ఒకరు తుపాకీని కొంచెం కిందివైపు ఉండగానే ఫైరింగ్ చేయడంతో ఆ తుపాకీ బుల్లెట్ ఓ వ్యక్తికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆ వ్యక్తి వరుడి తండ్రే కావడంతో పెళ్లి మండపంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ ప్రాంతంలోని బాద్‌నగర్‌లో చోటు చేసుకుంది.

VIDEO: Groom’s father killed in celebratory firing in Madhya Pradesh

ఇలాంటి ఘటనలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో తరచూ చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఇటీవల మీరట్, భగ్పత్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుని ఓ యువతి గాయపడగా, మరో వ్యక్తి మృతి చెందాడు.

ఫిబ్రవరిలో షామ్లి జిల్లాలో చోటు చేసుకున్న కాల్పుల్లో ఓ 8ఏళ్ల బాలుడు మృతిచెందాడు. అది సమాజ్ వాది పార్టీకి చెందిన కార్యక్రమం కావడం గమనార్హం. స్థానిక ఎన్నికల్లో గెలిచినందుకు గానూ ఆ పార్టీ సంబరాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు జరిపింది. వారి కాల్పుల్లో ఆ బాలుడు మృతి చెందాడు.

English summary
In a shocking incident, a man was killed in celebratory firing during a wedding procession at Badnagar area of Ujjain, Madhya Pradesh on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X