వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ఢిల్లీలో మహిళా డీసీపీపై దాడి చేసిన లాయర్లు

|
Google Oneindia TeluguNews

Recommended Video

వీడియో వైరల్: ఢిల్లీలో మహిళా డీసీపీపై దాడి చేసిన లాయర్లు

ఢిల్లీ: నవంబర్ 2వ తేదీన ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలోని పార్కింగ్‌లో లాయర్లకు పోలీసులకు మధ్య తలెత్తిన గొడవలో మరో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. లాయర్లకు పోలీసులకు జరిగిన గొడవ తర్వాత ఆ ప్రాంగణంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న మహిళా డీసీపీ మోనికా భరద్వాజ్‌పై కూడా లాయర్లు దాడి చేశారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న సీసీ కెమరాల్లో రికార్డయ్యాయి.

లాయర్లు పోలీసులకు మధ్య జరిగిన గొడవల్లో పరిస్థితిని చక్కబెట్టేందుకు కొంతమంది పోలీసులతో ఘటనాస్థలానికి చేరుకున్న డీసీపీ మోనికా భరద్వాజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రశాంతంగా ఉండాలంటూ ఆమె పిలుపు ఇస్తున్న క్రమంలో లాయర్ల సమూహం ఒక్కసారిగా డీసీపీ మోనికా భరద్వాజ్‌పైకి దూసుకొచ్చింది. లాయర్లు ఆమెపై దాడి చేయడం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దాడి చేసిన సమూహంలో దాదాపు 200 మంది లాయర్లు ఉన్నారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ పేర్కొంది.

Video making rounds:Woman DCP attacked by lawyers in Tis hazari court clash

ఒక మహిళా డీసీపీపై లాయర్లు దాడిచేయడాన్ని ఖండించింది జాతీయ మహిళా కమిషన్. ఈ కేసును సుమోటోగా స్వీకరించారు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు , ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీచేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ స్వాతీ మలివాల్ ఈ వీడియోను చూసి దాడి ఘటనను ఖండించారు. లాయర్లు పోలీసులు సంయమనంతో వ్యవహరించి శాంతి నెలకొనేలా చూడాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే తీస్‌హజారీ కోర్టు బయట గత శనివారం లాయర్లకు పోలీసులకు మధ్య పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. చిన్నగా ప్రారంభమైన ఈ గొడవ దాడుల వరకు వెళ్లింది. ఇక సోమవారం రోజున సాకేత్ కోర్టు బయట మరో పోలీసుపై కొందరు లాయర్లు దాడి చేశారు. దీంతో ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ముందు పోలీసులు నినసనలు తెలిపారు. దాడి చేసిన లాయర్లపై చర్యలకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత మరుసటి రోజున లాయర్లు కూడా విధులు బహిష్కరించి నిరసనలకు దిగారు. ఆ తర్వాత ఇలాంటి దాడులకు పాల్పడిన లాయర్లను వెంటనే గుర్తించాలంటూ బార్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీచేసింది.

English summary
A woman police officer was attacked last saturday following the clash between lawyers and Police near Tees Hazari court. A video containing the attack surfaced on social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X