వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేటు: విమానాన్ని గాలికొదిలేసి పైలెట్ల ‘హోలీ’ డ్యాన్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గాలిలో ఉన్న విమానాన్ని గాలికొదిలేసి విమానంలోపల ప్రయాణికులతో కలిసి చిందులు వేస్తూ హోలీ సంబరాలను జరుపుకున్న ఇద్దరు పైలట్లపై వేటు పడింది. ఈ మేరకు ఇద్దరు పైలట్లపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు డిజిసిఏ ప్రకటించింది. అంతేగాక స్పైస్‌జెట్ విమానయాన సంస్థకి, పైలట్లకు నోటీసులు జారీ చేసింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సోమవారం(మార్చి 17) హోలీ వేడుకల సందర్భంగా స్పైస్‌జెట్‌లోని ఇద్దరు పైలట్లతోపాటు విమాన సిబ్బంది కొందరు ప్రయాణికులతోపాటు ఆడిపాడారు. అయితే తతంగాన్ని వీడియో తీసిన కొందరు, ఆ వీడియోను వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్, ఇతర సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

Video: Mid-air Holi celebration sees suspension of 2 Spicejet pilots

ఆ వీడియోలో కాక్‌పిట్ నుంచి బయటికి వచ్చిన ఓ పైలట్ ప్రయాణికుల సీట్ల మధ్యలోని ఖాళీ స్థలంలో పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేశాడు. మరో పైలట్ అక్కడ జరుగుతున్న సంబరాలను ఫొటోలు తీశాడు. మరికొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఈ సంబరాలను వీడియో తీశారు. ఈ వీడియోలను పరిశీలించిన ఉన్నతాధికారులు.. తమ విధులకు సంబంధించిన నియమ నిబంధనలను పక్కన పెట్టిన ఇద్దరు పైలెట్లను సస్పెండ్ చేశారు.

కాగా, డిజిసిఏ సహకారంతో ఈ అంశంపై పరిశీలిస్తున్నట్లు స్పైస్‌జెట్ పేర్కొంది. డిజిసిఏ నిబంధనల ప్రకారం..ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రయాణంలో ఉన్న విమానం కాక్‌పిట్‌లో తప్పనిసరిగా పైలట్లు ఉండాల్సిందే. కాలకృత్యాలకు సంబంధించిన సమయాన్ని మినహాయించి అన్నివేళలా పైలట్లు కాక్‌పిట్ క్యాబిన్ వీడి బయటకు రాకూడదు. ఆ సమయంలోనూ మరో పైలట్ విధిగా క్యాబిన్లో ఉండాలి.

ప్రయాణికులను హోలీ సంబరాల వాతావరణంలోకి తీసుకెళ్లేందుకు ప్రపంచంలోని పలు విమానయాన సంస్థలు ఇలాంటి వేడుకలను సందర్భాన్ని బట్టి జరుపుతాయని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. విమానంలోని డ్యాన్స్ చేసిన వీడియో మొత్తం 2.5 నిమిషాల నిడివి ఉందని ఆయన పేర్కొన్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/MgjHTF0VbBM?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Mid-air Holi celebrations aboard eight flights have cost no-frill carrier SpiceJet heavily, with the DGCA issuing show cause notice to the airline and suspending two of its pilots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X