వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డిప్యూటీ కలెక్టర్ చెంప ఛెళ్లుమ‌నిపించిన ఎమ్మెల్యే(వీడియో)

|
Google Oneindia TeluguNews

రాయ్‌గ‌ఢ్: ఓ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గ‌ఢ్‌లో చోటు చేసుకుంది. క‌ర్జాత్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎన్సీపీ ఎమ్మెల్యే సురేశ్ లాడ్ స్థానిక డిప్యూటీ క‌లెక్ట‌ర్ అభ‌య్ క‌ల్గుద్క‌ర్ చెంప ఛెళ్లుమ‌నిపించారు.

ఇంట‌ర్నెట్‌లో ఇప్పుడీ వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. త‌న‌ను కొట్ట‌వొద్దంటూ ఎమ్మెల్యేను అభ‌య్‌ వేడుకుంటున్నా.. ఎమ్మెల్యే రెచ్చిపోవడం గమనార్హం. చేయి చేసుకోవ‌డ‌మే కాదు, డిప్యూటీ కలెక్ట‌ర్‌ను ఎమ్మెల్యే బెదిరించారు కూడా.

భూ సేక‌ర‌ణ అంశాన్ని చ‌ర్చించేందుకు డిప్యూటీ క‌లెక్ట‌ర్ అభ‌య్ ఓ స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాల్సిన అంశంపై వాగ్వాదం చోటుచేసుకుంది.

ఎమ్మెల్యే సురేశ్ లాడ్ భూమికి కూడా న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల్సి ఉంది. ఆ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న ఎమ్మెల్యే.. సదరు అధికారిపై చేయిచేసుకున్నారు.

కాగా, ఆ ఎమ్మెల్యేపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఇలాంటి రాజకీయ నేతల నుంచి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
A video showing Nationalist Congress Party (NCP) MLA from Karjat, Suresh Lad, slapping and assaulting a senior bureaucrat has surfaced on the internet. Lad, as seen in the video, slaps and threatens the deputy collector while the latter pleads him to stop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X