వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: హోటల్ గదిలో మద్యం తాగించి వికృత క్రీడ, సున్నిత ప్రాంతాల్లో.. వీడియో తీసి పైశాచిక ఆనందం..

|
Google Oneindia TeluguNews

సమాజ పోకడో, బలహీనవర్గాలు అంటే చిన్నచూపే తెలియడం లేదు కానీ.. అణగారిన వర్గాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో దొంగిలించారని ఇద్దరు దళితులను షోరూం ఓనర్, సిబ్బంది చితక్కొట్టిన సంగతి మరచిపోకముందే మరో ఘటన జరిగింది. రాజస్థాన్‌లోని బర్మార్‌లో ఓ యువకుడిపై నగదు దొంగిలించారని ప్రతాపం చూపించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఇనుపరాడ్డు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. ఈ మొత్తం వీడియో తీసి షేర్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

గతనెల 29న ఘటన

గతనెల 29న ఘటన


బర్మార్‌లో ఓ యువకుడిని ఒక బృందం ఆటకాయించింది. కారు డ్రైవర్‌గా పనిచేసే యువకుడిని.. గత నెల 29వ తేదీన దొంగిలించాడని నేరం మోపింది. అక్కడినుంచి హోటల్ గదిలోకి తీసుకెళ్లి తమ పైశాచిక ఆనందం పొందారు. కొట్టడమే గాక.. సున్నితమైన ప్రాంతాల్లో రాడ్డు పెట్టారని.. ఈ మొత్తాన్ని వీడియో తీశారని బాధితుడి సోదరుడు తెలిపారు. తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది. దీంతో అతని సోదరుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప సోదరుడి అతని జేబులో ఉన్న రూ.4800 కూడా తీసుకున్నారని చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు మోతీ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

స్పెషల్ టీం

స్పెషల్ టీం

బాధితుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ శరద్ చౌదరి తెలిపారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు వివరించారు. విజయ్ సింగ్ చరణ్ నేతృత్వంలోని టీం.. కేసు విచారిస్తోందని.. నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.

కేసు పెట్టకుండా.. అరెస్ట్..

కేసు పెట్టకుండా.. అరెస్ట్..

గత నెలలో ఘటన జరిగిన తర్వాత తన సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై తెలుపగా.. బాధిత యువకుడిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే అంశంపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సంబంధిత డీఎస్పీని ఆదేశించానని ఎస్పీ పేర్కొన్నారు. ఆ సమయంలో పోలీసులు తప్పు చేసినట్టు రుజువైతే.. చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టంచేశారు.

దళితులపై దాడి

దళితులపై దాడి

ఇటీవల నాగౌర్ జిల్లాలో ఇద్దరు దళితులపై బైక్ షోరూం ఓనర్, సిబ్బంది దాడిచేసిన సంగతి తెలిసిందే. మర్మాంగంలో పెట్రోల్ పోసి.. వీడియో తీసిన ఘటనపై దుమారం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఘటనపై త్వరగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇద్దరు దళితులతో అనుచితంగా ప్రవర్తించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే మరో ఘటన వెలుగుచూడటంతో అణగారిన వర్గాల భద్రతపై ప్రశ్న తలెత్తుతోంది.

English summary
rajasthan Barmer a youth was mercilessly beaten and a rod allegedly inserted into his private parts on suspicion of theft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X