వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫెషనల్ కిల్లర్స్: సునంద మృతిపై స్వామి సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి సునంద పుష్కర్ మృతి అంశం మరోసారి తెర పైకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. సునంద పుష్కర్‌ను ప్రొఫెషనల్ కిల్లర్స్ చంపి ఉంటారని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

సునంద పుష్కర్ పవర్ ఫుల్ పొలిటికల్ పర్సనాలిటీస్ గురించి చెప్పాలని భావించి ఉంటుందని స్వామి అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో, అండర్ వరల్డ్ యాక్టివిటీస్‌లో పలువురు ముఖ్యమైన వ్యక్తుల గురించి ఆమె చెప్పాలనుకొని ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

Video: 'Professionals killed Shashi Tharoor's wife Sunanda Pushkar'

సుబ్రహ్మణ్య స్వామి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ డీల్స్‌ను తాను బయటపెడతానని సునంద పుష్కర్ చెప్పిందని స్వామి గుర్తు చేశారు.

సునంద పుష్కర్ శరీరం పైన గాయాలు ఉన్నాయని, ఒక ఇంజెక్షన్ హోల్ ఉందని, ఆమె రక్తం పాయిజన్ అయిందని... వీటిని చూస్తే ఆమె మృతి సహజంగా జరిగింది కాదనిపిస్తోందన్నారు. దీనిపై కొత్తగా ఎన్నికైన తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తాను నాలుగు వారాల సమయం ఇస్తున్నానని చెప్పారు. కొత్త ప్రభుత్వం స్పందించకుంటే తాను సుప్రీం కోర్టుకు వెళ్తానని చెప్పారు.

శశిథరూర్ థరూర్ స్పందన

ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగాధిపతి ఆరోపణల పైన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ స్పందించారు. తన భార్య సునంత మృతిపై పారదర్శకంగా దర్యాఫ్తు జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

English summary
Six months have gone and now Sunanda Pushkar death mystery once again surfaced to haunt her husband Shashi Tharoor. This time Subramanian Swamy raised questions with shocking allegations.The BJP leader on Wednesday, July 2 claimed that Tharoor's wife, a Kashmiri pandit, was killed by professional killers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X