ఇదీ మన ఇండియా!: రైలే ఆగింది కానీ.. వాహనదారులు మాత్రం ఆగరు(వీడియో)

న్యూఢిల్లీ: గత కొద్ది రోజుల క్రితం అమృత్‌సర్‌లో రావణ దహనం సందర్భంగా రైలు ప్రమాదానికి గురై 62 మంది మరణించిన ఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, ప్రజల అలసత్వం కారణంగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
రైలు పట్టాలపై ఉంటే ప్రమాదమని తెలిసినా.. అక్కడేవుండి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనం అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా జనాలు నిర్లక్ష్యాన్ని వీడకపోవడం గమనార్హం.
రైలు పట్టాలపై ఉండొద్దని ఎంతో చెప్పా: పంజాబ్ ప్రమాదంపై నిర్వాహకుడి కంటతడి

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ వీడియోలో.. ఒక పక్క దారివ్వాలంటూ రైలు హార్న్ కొడుతోంది, మరోపక్క అక్కడి గార్డ్ వారిని కొద్దిసేపు ఆగండని వారిస్తున్నాడు.
ye mera india pic.twitter.com/rAbVmsjCue
— Dr. Gill (@ikpsgill1) October 22, 2018
కానీ, ఇవేవి అక్కడున్న వాహనదారుల చెవికెక్కడం లేదు. అయితే ఈ ఘటన వాస్తవంగా ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం వైరల్‌గా మారింది. అందులో ప్రజలు ప్రవర్తిస్తోన్న తీరును చూస్తే మాత్రం ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదాలు జరగవా? అనే సందేహం కలుగక మానదు. యే మేరా ఇండియా(ఇదీ మన భారతదేశం) అంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయడం గమనార్హం.