వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : కోర్టు విచారణ జరుగుతుండగా లాయర్ స్మోకింగ్... వీడియో వైరల్...

|
Google Oneindia TeluguNews

బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడంపై రాజస్థాన్ హైకోర్టు చేపట్టిన వర్చువల్ విచారణ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధవన్ పొగ తాగుతూ కనిపించడం కలకలం రేపింది. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపిస్తుండగా... రాజీవ్ ధవన్ తన ముఖానికి డాక్యుమెంట్ పేపర్స్ అడ్డుపెట్టుకుని పొగ తాగుతూ కనిపించారు. ఆయన తన ముఖాన్ని కవర్ చేసుకున్నప్పటికీ... రింగులు రింగులుగా పొగ వీడియోలో స్పష్టంగా రికార్డయింది. ఆయన చేతిలోని హుక్కా కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది ఏ రోజు జరిగిందన్న దానిపై సరైన స్పష్టత లేదు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు మంగళవారం అని రిపోర్ట్ చేయగా.. మరికొన్ని బుధవారం,గురువారం అని రిపోర్ట్ చేశారు. రాజీవ్ ధవన్ పొగ తాగడాన్ని రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తి గమనించారా లేదా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ హైకోర్టు దీన్ని తీవ్రంగా పరిగణిస్తే రాజీవ్ ధవన్‌పై చర్యలు తప్పవు. దీనిపై రాజీవ్ ధవన్ నుంచి కూడా ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు.

 Video shows advocate Rajeev Dhavan ‘smoking’ during virtual hearing

రాజీవ్ ధవన్ బీఎస్పీ ఎమ్మెల్యేల తరుపున హైకోర్టులో వాదిస్తున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం కావడాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ అధినేత్రి మాయావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించడంతో విచారణ కొనసాగుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ న్యాయవాది సాధారణ చొక్కాతో వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనగా... కోర్టు వారించింది. కచ్చితంగా తెల్లటి చొక్కా/తెల్లటి సల్వార్‌ కమీజ్‌ ధరించాలని సూచించింది.

కాగా,కరోనా వైరస్ నేపథ్యంలో దేశ న్యాయ వ్యవస్థ వర్చువల్ వ్యవస్థలోనే కేసుల విచారణను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ ద్వారా పిటిషన్లను స్వీకరిస్తూ కేసుల విచారణ చేపడుతున్నారు.

English summary
Senior advocate Rajeev Dhavan got some advice on the perils of smoking from a high court judge on Thursday, as a video clip surfaced showing the lawyer apparently taking a puff from a hookah during a virtual hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X