వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వేలో ఇలాంటి పరిస్థితా?: గొడుగు పట్టుకుని రైలు నడుపుతున్న డ్రైవర్(వీడియో)

సామాజిక కార్యకర్త, జర్నలిస్టు అయిన సుచేతా దళాల్.. ధన్‌బాధ్ లోని ఒక రైల్వే డ్రైవర్ దుస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

|
Google Oneindia TeluguNews

ధన్‌బాద్: వర్షాకాలం సమీపిస్తుందంటే చాలు.. పేద, మధ్యతరగతి కుటుంబాలు అలర్ట్ అయిపోతాయి. ఇంటి పైకప్పుకు ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో వాటిని పూడ్చే పనిని ముందేసుకుంటాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తుంది.

ఆఖరికి బస్సు పైకప్పులకు చిల్లులు పడ్డ సంఘటనలు కూడా చూసుంటాం. కానీ రైలు పైకప్పుకు చిల్లు పడటం ఎప్పుడైనా చూశారా?.. జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్ రైల్వేలో ఇలాంటి దుస్థితి కొనసాగుతోంది. రైలు పైకప్పు సరిగా లేకపోవడంతో.. రైల్వే డ్రైవర్ ఒకరు గొడుగు పట్టుకునే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

సామాజిక కార్యకర్త, జర్నలిస్టు అయిన సుచేతా దళాల్,, ఆ రైల్వే డ్రైవర్ దుస్థితిని ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ట్యాగ్ చేసి ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేసింది.

కాగా, దీనిపై స్పందించిన సదరు రైల్వే డ్రైవర్.. ప్రతీ ఏడాది తనకు ఈ పరిస్థితి తప్పడం లేదని వాపోయాడు. గొడుగు పట్టుకునేది తాను తడవకుండా ఉండటానికి కాదని, కంట్రోలో పానెల్ పై నీళ్లు పడకుండా ఉండటానికి అని చెప్పారు. మరి రైల్వే మంత్రి ఇప్పటికైనా దీనికి పరిష్కారం చూపిస్తారో లేదో?..

English summary
Activist and journalist Sucheta Dalal (suchetadalal) tweeted a video showing a Indian Railways (IR) engine with a faulty roof such that water was leaking down into the engine compartment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X